Homeకోటంరెడ్డి హత్యకు కుట్ర

కోటంరెడ్డి హత్యకు కుట్ర

- Advertisement -

. సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్‌
. పోలీసుల అప్రమత్తం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసేలా ఓ ప్రజాప్రతినిధిపై హత్యకు సంబంధించిన కుట్ర కోణం బహిర్గతమైంది. నెల్లూరు రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగిందన్న ప్రచారంతో అధికార పార్టీ ఉలిక్కిపడిరది. ఈ కుట్రకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారడంతో కూటమి ప్రభుత్వంతోపాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. కూటమి పార్టీ నేతలు కోటంరెడ్డిని ఫోన్‌లో పరామర్శించి… జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తనపై హత్యాయత్నం కుట్రపై ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు. ఆ వీడియో పోలీసులకు చిక్కడంతో నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్‌ స్పందిస్తూ ఎమ్మెల్యే కోరితే అదనపు భద్రతా చర్యలు చేపడతామని వెల్లడిరచారు. గతంలో వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా కోటంరెడ్డి ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కోటంరెడ్డి మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. అనంతరం ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సహకారంతో తన సొంత నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో ఆయనపై హత్యకు కుట్ర జరిగిందన్న వార్తలు ఆయన అనుచరులను, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేశాయి. అందుకు సాక్ష్యంగా సామాజిక మాద్యమంలో వీడియో బయట పడటమే. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వీడియోలో కొంతమంది మాట్లాడుకున్న విషయం వెలుగు చూసింది. కోటంరెడ్డిని చంపాలని ఐదుగురు రౌడీషీటర్లు పథకం వేసినట్లుగాను, లేడీడాన్‌ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్‌, జగదీశ్‌ ఇంకా కొంతమంది వ్యూహం రచించినట్లుగా కోటంరెడ్డి వర్గీయులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వీడియోతోపాటు సాక్ష్యాలు సేకరించారు. వీడియో వచ్చిన వెంటనే స్పందించడంతో కోటంరెడ్డి ప్రాణాలకు ముప్పు తొలగిందని అంటున్నారు.
ఇటీవల కోటంరెడ్డిపై వైసీపీ సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం వచ్చింది. కోటంరెడ్డిని హత్యచేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని అరుణకు ప్రత్యర్థి పార్టీల నుంచి ఒకరు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవాలపై నిగ్గు తేల్చేందుకుగాను పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బుతో ప్రలోభపెట్టి కోటంరెడ్డి అనుచరులను రౌడీషీటర్లు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లుగా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ హత్య కుట్రపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. మంత్రి పదవి కంటే తనకు ప్రాణాలే ముఖ్యమని చెప్పారు. పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎస్పీ శ్రీకాంత్‌ అధ్వర్యంలో పోలీసుల బృందం ఈ సంఘటనపై ఆరా తీస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు