ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ తన పరివర్తనను సూచించే ‘హౌస్లా హై తో హో జాయేగా’ అనే కొత్త గ్రూప్ బ్రాండ్ తత్వశాస్త్రాన్ని ప్రకటించింది. ఈ శక్తివంతమైన కొత్త గ్రూప్ బ్రాండ్ తత్వశాస్త్రం కోటక్ నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఇంకా, కేవలం ఒక బ్యాంకుగానే కాకుండా, ఆశాజనక భారతీయుల కోసం ఒక సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా నిలబెట్టడానికి నూతన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కోటక్ బహుళ-ఛానల్ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. టెలివిజన్, డిజిటల్, ప్రింట్, అవుట్‌డోర్ సోషల్ మీడియా ద్వారా విస్తరించనున్న ఈ ప్రచారం, భారతీయులను వారి లక్ష్యాలను సాధించడానికి మరింత ధైర్యంగా ముందుకు సాగేలా ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్-హెడ్ అఫ్లుయెంట్ రోహిత్ భాసిన్ మాట్లాడుతూ, ’హౌస్లా హై తో హో జాయేగా’ కేవలం ఒక బ్రాండ్ తత్వశాస్త్రం మాత్రమే కాదు ఇది కోటక్‌లో ఒక విప్లవాత్మక ఉద్యమానికి తొలి అడుగు అని అన్నారు.