దౌత్యానికి మళ్లీ ప్రయత్నాలు
తెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజులు సాగిన భీకర దాడులతో పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొన్నది. మాజీ అధినేత అయాతుల్లా అలీ ఖామేనీ అంత్యక్రియల నడుమ పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అంతిమ యాత్రలో సైతం ప్రతీకారం నినాదాలు మార్మోగాయి. ఖామేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్‌జీసీ సైతం ప్రతిజ్ఞబూనింది. అయితే 48 గంటలకుపైగా సాగిన పోరు తర్వాత తుపాకులు మూగబోయాయి. గల్ఫ్‌లో ఒక విధంగా అప్రశాంత వాతావరణం ఉంది. మధ్యవర్తిత్వం వహించిన దేశాలు మరోమారు దౌత్యపరమైన చర్యలకు పూనుకోవడంతో దాడులు ఆగాయి. తెహ్రాన్‌తో చర్చలకు వాషింగ్టన్ కట్టుబడి ఉన్నట్టు అమెరికా అధికారికంగా ప్రకటించింది. సాంకేతికపరమైన చర్చలకు సిద్ధమని పేర్కొంది. ఇదిలాఉంటే ఇరాన్‌లోని అణు విద్యుత్తు ప్లాంట్ ఉన్న బుషెహర్ వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా అమెరికా దాడి చేసిందిదని అక్కడి గవర్నర్ వెల్లడించారు. కొనారాక్‌లోని నేవీ జోన్‌లో వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్ అధికారి మహమ్మద్ యూనిస్ హక్కానీ పేర్కొన్నారు. అయితే ఈ దాడులతో తమకు సంబందం లేదని అమెరికా చెబుతుండగా, మా దళాలకు ప్రమేయం ఉన్నదంటూ ఇజ్రాయిల్ అధికారి వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఈ దాడులకు పాల్పడినట్లు ఇరాన్ ఆరోపించింది. రెండు రోజుల్లో 170కుపైగా లక్ష్యాలపై దాడులు జరిగినట్లు పేర్కొంది. అయితే ఏడు రోజుల పాటు సాగిన ఖామేనీ అంత్యక్రియలు ముగిసిన నేపథ్యంలో తుది ఒప్పందం దిశగా సంప్రదింపులు పున:ప్రారంభయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హోర్మూజ్ జల సంధిని పూర్తిస్థాయిలో తెరవడం, తెహ్రాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం వంటి చిక్‌కు సమస్యలపై ఈసారి విస్తృతంగా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.
మూడోసారి దాడులకు సిద్ధం: ఇజ్రాయిల్
ఇరాన్‌పై అవసరమైతే మూడో సారి దాడులకు సిద్ధమని ఇజ్రాయిల్ ప్రకటించింది. గగనతల ఆధిపత్యం కోసం మళ్లీ యుద్ధం చేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.‘తిరిగి వెళ్లాల్సి వస్తే మాత్రం దాడులు మునపటి కంటే తీవ్రంగా జరుగుతాయి’ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్¨ తెలిపారు. కాగా, ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. వాషింగ్టన్ రెచ్చిపోతుండటంతో ఆ దేశానికి చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా జోర్డాన్పై దాడి చేసినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ వెల్లడించింది.
గల్ఫ్‌లో ఆగిన దాడులు
- Advertisement -
RELATED ARTICLES


