Saturday, April 12, 2025
Homeగేట్స్‌తో కొత్త ఆవిష్కరణలు

గేట్స్‌తో కొత్త ఆవిష్కరణలు

. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగం
. గేట్స్‌ ఫౌండేషన్‌, ఏపీ ప్రభుత్వాల మధ్య ఎంవోయూ
. దిల్లీలో బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ
. ఏపీకి రావాలని ఆహ్వానించిన ముఖ్యమంత్రి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గేట్స్‌ ఫౌండేషన్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్ర మాలను అమలు చేయడానికి అవగాహన కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్‌, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో విస్తృతస్థాయిలో ప్రయో జనాలు అందించే విధానాలను అభి వృద్ధి చేసే అంశాలపై ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల్లో కొత్త ఆవిష్కరణలు అందించడానికి సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత టెక్నాలజీ ద్వారా ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌, ఆటోమేటెడ్‌ డయాగ్నోస్టిక్స్‌ విభాగాల్లో గేట్స్‌ ఫౌడేషన్‌ సహకారం అందించను ంది. అదేవిధంగా వ్యవసాయ రంగం లోనూ ఏఐ ఆధారిత కార్యక్రమాలకు, సాగు నిర్వహణలో శాటిలైట్‌ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు. అదే కొత్త ఆవిష్కరణల ద్వారా ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపరచను న్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గేట్స్‌ ఫౌండేషన్‌ మద్దతుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసా యం, విద్య రంగాల్లో వినూత్న పరిష్కా రాలు చూపేందుకు ఈ ఒప్పం దం ఎంతో దోహదపడుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిందిగా బిల్‌గేట్స్‌ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ ఒప్పందం ద్వారా డేటా ఆధారిత అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న చొరవ, సంకల్పాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌గేట్స్‌ ప్రశంసించారు. ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరకు, సులభంగా లభ్యమమ్యే, స్థానికంగా తయారు చేసే వైద్య పరికరాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని, తద్వారా ప్రజల జీవితాలను మార్చవచ్చని చంద్రబాబు అన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవవచ్చునని అన్నారు. దిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో గేట్స్‌ ఫౌడేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ గేట్స్‌ ఫౌడేషన్‌తో ఎంవోయూలో పాల్గొన్నారు. సమావేశంలో కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, ఎంపీి శ్రీకృష్ణ దేవరాయులు, సీిఎంవో అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు