Friday, December 27, 2024
Homeఆంధ్రప్రదేశ్గౌరవ హైకోర్టు సూచనలతో రోడ్డు భద్రత ఉల్లంఘనలపై చర్యలు మరింత పటిష్టం

గౌరవ హైకోర్టు సూచనలతో రోడ్డు భద్రత ఉల్లంఘనలపై చర్యలు మరింత పటిష్టం

జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఉధృతం…

ప్రజల భద్రతే ముఖ్యం

జిల్లా ఎస్పీ పి.జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : విశాలాంధ్ర- అనంతపురం : హైకోర్టు సూచనలతో రోడ్డు భద్రత ఉల్లంఘనలపై చర్యలు మరింత పటిష్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… . హైకోర్టు తాజాగా సూచించిన మేరకు జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మరింత ఉధృతం చేస్తున్నామన్నారు. ఉల్లంఘనదారులకు చలానాలు జారీ అయ్యాక మూడు నెలల లోపు ఫైన్ అమౌంటు చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే ఆ తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా…డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్ సి లు, త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్, ఆటోల ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, ఆపోజిట్ డ్రైవింగ్, నంబర్ లెస్ వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ లపై దృష్టి పెడతామన్నారు. ఉల్లంఘనదారులపై జరిమానాలు విధిస్తామన్నారు. ఈనేపథ్యంలో… డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆర్ సి లు లేకుండా వాహనాలలో తిరగరాదన్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. ఓవర్ లోడ్ తో ఆటోలలో ప్రయాణీకులను తరలించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నంబర్ లేని వాహనాలలో వెళ్లడం, ఆపోజిట్ రూట్ లో పోవడం, ర్యాష్ డ్రైవింగ్ , రేసింగ్ లపై కూడా పక్కాగా చర్యలు ఉంటాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు