విశాలాంధ్ర హైదరాబాద్ : బంజారాహిల్స్ డివిజన్ 93 ఎన్.బీ.టీ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కాముడు దహనం కార్యక్రమంలో బస్తివాసులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ప్రజలందరికీ హోలీ పండుగ శభాకాంక్షలు తెలియజేవారు. ఒకరికి ఒకరు హోలీ రంగులు పూసుకొని ఘనంగా హోలీ పండుగ జరుపుకొన్నారు. విశాలాంధ్ర
మల్కాజిగిరి : హోలీ పండుగ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో పరిధిలోని పలు కాలనీలో కాలనీ సభ్యులు ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ముఖ్యతిథిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. హోలీ వేడుకలు ఆనందోత్సాహంతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజలంతా పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని కార్పొరేటర్ హేమలతా సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. 130 డివిజన్ సుభాష్‌నగర్‌లో స్థానిక కార్పొరేటర్ హేమలతా సురేష్‌రెడ్డి మహిళలతో కలిసి హోలీ పండుగ ఘనంగా జరిపారు. అనంతరం డివిజన్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
విశాలాంధ్ర – ఆమనగల్లు : హోలీ వేడుకలు జోరుగా సాగాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ డ్యాన్సులు వేస్తూ హోలీ పండుగచేసుకున్నారు. హోలీ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిషేధించారు. అపరిచితులపై రంగులు వేయరాదన్నారు. భవనాలు, వాహనాలపై రంగులు పోయవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రంగుల పండుగ కేరింతలు,ఆనందోత్సవాల మధ్య శుక్రవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యవతీయువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామదహనంనిర్వహించారు. చిన్నా పెద్దా కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. హోలీ సంబరాలల్లో ఆనందం, ఐక్యతను నింపే పండుగ హోలీ అని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి చెప్పారు. శుక్రవారం ఆమనగల్లులో ఆయన హోలీ వేడుకలలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులతో కలిసి రంగులు చల్లుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
విశాలాంధ్ర-దుండిగల్: ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య రంగులతో జరుపుకొనే ప్రకృతి పండుగ హోలీ అని బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న హోలీ పండుగ సంబరాలలో బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ పండగలు మన సంస్కృతికి ప్రతీకలని, పర్యావరణంతో మమేమకమై జీవించాల్సిన బాధ్యతను గుర్తుచేసే హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని ఆయన వెల్లడిరచారు.
హోళి రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుని యువకులు సంతోషంగా సరదాగా గడుపుతారని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీతారాం రెడ్డి, ఆర్ నర్సింహాచారి, జంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అందె అశోక్, సిద్ధం శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు లక్ష్మరెడ్డి, బొక్క జీవన్‌రెడ్డి, నాసి శ్రీపాల్ రెడ్డి, గోనె అనంతరెడ్డి, కమ్మరి శ్రీనివాస్, బాలకృష్ణ, నాగశేషులు, కోల సూర్య ఆలయ కమిటీ అధ్యక్షులు ఎస్ సురేందర్ రెడ్డి, ఆకుల నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విశాలాంధ్ర- ఆమనగల్లు : కామ దహనం కార్యక్రమం సాంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద కట్టెలు పేర్చి కాముని ప్రతిమకు అర్చకులు వెంకటేశ్వర శర్మ ప్రత్యేక పూజలు అనంతరం వంశపార్యపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలతో, కడ్తాల్ గ్రామ పెద్దల సమక్షంలో పూజలు నిర్వహిస్తుండగా కాముని దహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలను చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు మహేష్, మాజీ వార్డు సభ్యులు హెచ్‌ఆర్ మహేష్, నరేందర్ రెడ్డి, గణేష్, ఎర్రోళ్ల రాఘవేందర్, గ్రామ పెద్దలు సాయి రెడ్డి, వెంకటరెడ్డి, సురేందర్ రెడ్డి, జంగారెడ్డి, శేఖర్ రెడ్డి, సత్యం, దూదేరాములు, పాండు, మూడ రవి, మహేష్, సురేష్, లాయర్ సంతోష్, దేవేందర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.