Homeచరిత్ర సృష్టించిన శుభాంశు

చరిత్ర సృష్టించిన శుభాంశు

- Advertisement -

ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డు

. అమెరికా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ప్రయోగం
. స్పేస్‌క్రాఫ్ట్‌ డాకింగ్‌ విజయవంతం
. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు పరిశోధనలు

కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ప్రవేశించింది. వీరు ఈ కేంద్రంలో 14 రోజులపాటు గడుపుతారు. దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. అందులో హ్యూమన్‌ ఫిజియాలజీ, న్యూట్రిషన్‌, సీడ్‌ జెర్మినేషన్‌లలో మైక్రో గ్రావిటీ పరిశోధనలు న్నాయి. ప్రధాని మోదీతో సంభాషించటం సహా అంతరిక్షం నుంచే శుక్లా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యోమగాములు 14 రోజులపాటు స్థానికంగా లభించే ఆహారాన్నే తీసుకోనున్నారు.
ఈ ప్రయాణం అద్భుతం: శుభాంశు
అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి ముందు శుభాంశు… లైవ్‌ కాల్‌లో మాట్లాడారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. భారరహిత స్థితిలో ఎలా నడవాలో చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని అన్నారు. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాని చెప్పారు. తన భుజంపై మువ్వన్నెల పతాకం ఉందని, అది చూస్తున్నప్పుడు తాను ఒంటరి కానని, కోట్లాది మంది భారతీయులు తోడుగా ఉన్నారనే భావన కలుగుతుందని చెప్పారు.
డాకింగ్‌ ప్రక్రియ సంక్లిష్టం
వ్యోమగాములు ప్రయాణించిన డ్రాగన్‌ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం (డాకింగ్‌) అత్యంత సంక్లిష్ట, సున్నిత ఆపరేషన్‌. ఇందుకోసం డ్రాగన్‌ వ్యోమనౌక తన వేగాన్ని, స్థితిని అత్యంత కచ్చితత్వంతో అంతరిక్ష కేంద్రంతో సమన్వయం చేసుకుంది. లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది. అందువల్ల డ్రాగన్‌ వ్యోమనౌక చాలా నెమ్మదిగా దగ్గరైంది. ఈ క్రమంలో స్వల్పస్థాయి సర్దుబాట్లనూ అత్యంత కచ్చితత్వంతో చేసుకుంది. అంతిమంగా అది ఐఎస్‌ఎస్‌కు చెందిన హార్మనీ మాడ్యూల్‌తో అనుసంధామైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు