Friday, March 14, 2025
Homeఅంతర్జాతీయంజన్మత: పౌరసత్వంపై సుప్రీంకెళ్లిన ట్రంప్‌

జన్మత: పౌరసత్వంపై సుప్రీంకెళ్లిన ట్రంప్‌

వాషింగ్టన్‌: జన్మత: పౌరసత్వం రద్దుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఆదేశాలను ఫెడరల్‌ కోర్టులు నిలిపివేయడాన్ని సవాల్‌ చేశారు. జన్మత: పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కోర్టులు ఇంజెక్షన్‌ ఆర్డర్లు జారీ చేశాయి. ట్రంప్‌ సర్కారు ఇటీవల తొలగించిన ప్రొబేషనరీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆరు ఏజెన్సీలకు కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలిచ్చింది. ఇదిలావుంటే జన్మత:పౌరత్వంపై సుప్రీంకోర్టులో ట్రంప్‌ పిటిషన్‌ విచారణకు రాగా… ఆపద్ధర్మ సొలిసిటర్‌ జనరల్‌ సారా హారిస్‌ స్పందిస్తూ ఈ పిటిషన్‌ సాధారణమైనదే అని అన్నారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లు వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని కోరారు. ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా?కాదా?అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు. అమెరికా చట్టాల ప్రకారం ఆదేశంలో పుట్టిన వారికి జన్మత:పౌరసత్వం లభిస్తుంది. ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. తండ్రి శాశ్వత నివాసి అయి… తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో ఉంటున్నా కూడా పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు.
గ్రీన్‌కార్డ్‌ ఉన్నా శాశ్వత నివాసులు కారు: వాన్స్‌
గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో శాశ్వత నివాస హక్కు లభించినట్లు కాదు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. అమెరికా పౌరసత్వం ఎవరికి ఇవ్వాలని, ఎవరిని మాతో కలుపుకోవాలన్నది మేమే నిర్ణయిస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఇది వాక్‌స్వేచ్ఛకు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని వక్కాణించారు.
కిమ్‌ ఓ అణుశక్తి: ట్రంప్‌
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఒక అణు శక్తి అని ట్రంప్‌ అన్నారు. అణ్వస్త్రాలు తగ్గించగలగడం గొప్ప విజయమే అవుతుందన్నారు. కిమ్‌ వద్ద అణ్వాయుధాలు చాలా ఉన్నాయన్నారు. భారత్‌, పాకిస్థాన్‌ వంటి ఇతర దేశాల వద్ద కూడా అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిపారు. నాటో అధినేతతో భేటీ క్రమంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. దక్షిణ కొరియా-అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో నిత్యం ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ కొరియా-అమెరికా తమపై దాడికి సన్నాహంగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని కిమ్‌ ప్రభుత్వం వాదిస్తుండటం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు