Tuesday, February 25, 2025
Homeవిశ్లేషణజర్మనీలో వామపక్షం సీట్లు భారీగా పెరుగుదల

జర్మనీలో వామపక్షం సీట్లు భారీగా పెరుగుదల

సాత్యకి చక్రవర్తి

జర్మనీలో వామపక్షాల బలం గణనీయంగా పెరిగింది. పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలలో గతంలో కన్నా ఎక్కువ సీట్లలో విజయం వామపక్ష అభ్యర్థులు విజయం సాధించారు. జర్మనీలోని బుండెస్టాగ్‌ (పార్లమెంటు)లో మొత్తం 630 సీట్లు ఉన్నాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మితవాద కూటమి సీడీయూ/సీఎస్‌యూ 28.5శాతం ఓట్లు పొందగా, వామపక్షం గతంలోకంటే రెట్టింపు అంటే 8.7శాతం ఓట్లు, 64 సీట్లు సాధించింది. తీవ్ర మితవాద ఏఎఫ్‌డీ 20.7శాతం ఓట్లు తెచ్చుకున్నది. సెంటర్‌వామపక్ష ఎస్‌పీడీకి కలిపి 16.5శాతం ఓట్లు లభించాయి. గతంలోకంటే ఈసారి ఎన్నికల్లో వామపక్షానికి భారీగా ఓట్లు వచ్చాయి. ఇంకా ఇతర పార్టీలుగ్రీన్స్‌కు 11.7శాతం, వామపక్షం బీఎస్‌డబ్ల్యూకు 4.9శాతం ఓట్లు వచ్చాయి. ఫ్రీ డెమొక్రటిక్‌ పార్టీకి 5శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏమంటే మితవాద పార్టీ ఎఫ్‌డీపీ వాణిజ్య రంగానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్‌పీడీ (సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ) కూటమి తరఫున ఛాన్సలర్‌గా పోటీ చేసిన ఓల్ఫ్‌ స్కోల్జ్‌ని ఓటర్లు ఓడిరచారు. అతి మితవాద పార్టీ ఏఎఫ్‌డీ ఎక్కువగా ప్రయోజనం పొందింది. వామపక్ష ది లింక్‌ పార్టీ పునరుజ్జీవనం పొందుతోంది. గత మూడేళ్లకాలంలో ది లింక్‌ పార్టీ నుంచి చీలిపోయిన బీఎస్‌డబ్ల్యూ తిరిగి ది లింక్‌కు మద్దతు తెలియ జేసింది. 2023లో బీఎస్‌డబ్ల్యూ చీలిపోయి మళ్లీ 2024లో ది లింక్‌కు దగ్గరైంది.
రాజకీయ విశ్లేషకుల అంచనాప్రకారం, సీడీయూ/సీఎస్‌యూకు వచ్చిన ఓట్ల శాతం ప్రకారం 208 సీట్లు వచ్చినట్లువుతుంది. ఏఎఫ్‌డీకి 151సీట్లు, ఎస్‌పీడీకి 121 సీట్లు, గ్రీన్స్‌కి 85సీట్లు, ది లింక్‌కు 64సీట్లు వచ్చినట్లవుతుందని అంచనా వేశారు. 630సీట్లు ఉన్న సభలో మెజారిటీ కావాలంటే 316సీట్లు రావాల్సిన అవసరం ఉంటుంది. ఏ పార్టీ కూడా ఏఎఫ్‌డీకి మద్దతు ఇవ్వడం లేదు. సీడీయూ/సీఎస్‌యూతో ఏఎఫ్‌డీకి చెందిన నాయకుడు ఫ్రెడరిక్‌ మెర్జ్‌ కూటమి ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నారు. కూటమి ఏర్పడితే మొత్తం 329 మంది సభ్యులవుతారు. ఈ రెండు పార్టీలతో ఎస్‌పీడీకూడా కలుస్తున్నది. మూడు పార్టీలు కలిస్తే 329 మందితో మెజారిటీ సాధిస్తారు. వాస్తవంగా ఎఫ్‌డీపీ, మితవాదులు వామపక్ష పార్టీ ది లింక్‌తో కలవరు. నూతన ప్రభుత్వం ఏర్పడేందుకు వామపక్ష ది లింక్‌కు, మితవాదులు, ఎస్‌పీడీ కలిస్తే కూడా నూతన ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎస్‌పీడీ సొంతంగా కానీ, గ్రీన్స్‌ లేదా ది లింక్‌ కానీ కలిసినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ పార్టీల సభ్యుల సంఖ్య 270 అవుతుంది. మెజారిటీకి చాలాతక్కువ సంఖ్య ఉంటుంది. మితవాదులు, గ్రీన్స్‌ కలిస్తే 293 మంది అవుతారు.
మెజారిటీ కావాలంటే 316 మంది సభ్యుల అవసరం ఉంటుంది. అందువల్ల ఈ పార్టీలు కలిసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత తీవ్ర మితవాద పార్టీ ఎఎఫ్‌డీకి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాతకూడా మద్దతు ఇస్తున్నారు. సీడీయూ/సీఎస్‌యూ ఎస్‌పీడీతో కలిసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ రెండు పార్టీలను ఏఎఫ్‌డీ బెదిరిస్తోంది. ఏఎఫ్‌డీ నాయకురాలు అలైస్‌ వైడెల్‌ ఎన్నికల ఫలితాలపై అత్యుత్సాహంగా ఉన్నారు. 2029లో జరిగే ఎన్నికల పైన ఏఎఫ్‌డీ దృష్టి సారిస్తుందని, తప్పక గెలుపొందుతుందని ఉత్సాహంగా ఉన్న ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం అస్థిరంగా ఉంటుందని, ఏఎఫ్‌డీ ప్రభుత్వ స్థిరత్వాన్ని నిర్ణయిస్తుందని ఆమె అన్నారు. గతంలోనూ సీడీయూ, ఎస్‌పీడీలు కూటమిగాఏర్పడి ప్రభుత్వాలను నడిపాయి.
రెండు పెద్ద పార్టీలు కూటమిగా ఏర్పడితే అది సహజసిద్ధమైన ప్రభుత్వంగా నడుస్తుందని ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారానికిముందే 15 అంశాలతో కూడిన ప్రణాళికను రూపొందించి నట్లు ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెప్పారు. చేపట్టవలసిన చర్యలపైన మెర్జ్‌ వాగ్దానాలు చేశారు. సరిహద్దులను కట్టుదిట్టం చేయడం దేశంలోకి రావాలని కోరేవారిని అనుమతించడం వంటి చర్యలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దడం, వాణిజ్యతరహాలో మార్పుకు కృషిచేస్తానని మెర్జ్‌ చెప్పారు. అవినీతిని నిరోధించడం, పన్నులు తగ్గించడం, దేశ అప్పును తగ్గించడం తదితర అంశాలపై ప్రభుత్వం పనిచేయగలదన్నారు. వామపక్ష ది లింక్‌ తాజా ఎన్నికల్లో 64సీట్లు గెలవగా, గతంలో 28సీట్లు మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది.

మితవాద పార్టీ ఎఫ్‌డీపీ వాణిజ్య రంగానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్‌పీడీ (సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ) కూటమి తరఫున ఛాన్సలర్‌గా పోటీ చేసిన ఓల్ఫ్‌ స్కోల్జ్‌ని ఓటర్లు ఓడిరచారు. అతి మితవాద పార్టీ ఏఎఫ్‌డీ ఎక్కువగా ప్రయోజనం పొందింది. వామపక్ష ది లింక్‌ పార్టీ పునరుజ్జీవనం పొందుతోంది. గత మూడేళ్లకాలంలో ది లింక్‌ పార్టీ నుంచి చీలిపోయిన బీఎస్‌డబ్ల్యూ తిరిగి ది లింక్‌కు మద్దతు తెలియ జేసింది. 2023లో బీఎస్‌డబ్ల్యూ చీలిపోయి మళ్లీ 2024లో ది లింక్‌కు దగ్గరైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు