సాత్యకి చక్రవర్తి
యూరోపియన్ యూనియన్ దేశమైన పోర్చుగల్‌లో వచ్చే ఆదివారం, మే 18న జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. 230 మంది సభ్యుల పార్లమెంటును ఎన్నుకోవడానికి ఆ దేశం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది జరిగే ఎన్నికలు గత మూడు సంవత్సరాలలో మూడవసారి జరిగే ఎన్నికలుగా పోర్చుగల్‌లో పాలక సంకీర్ణ ప్రభుత్వాల దుర్బలత్వానికి నిదర్శనంగా ఉన్నాయి. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో సైతం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో సొంతంగా మెజారిటీ పొందే స్థితిలో లేదనేది స్పష్టం. మార్చి 2024లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని మొత్తం 230 స్థానాల్లో 80 స్థానాలతో రైట్‌వింగ్‌్ డెమోక్రటిక్ అలయన్స్ (ఏడీ) అగ్రస్థానంలో నిలిచింది. పెడ్రో నానో శాంటోస్ నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ 77 స్థానాలతో, ఫార్ రైట్ చెగా 50 స్థానాలను గెలుచుకుంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి కేవలం 4 సీట్లు, లెఫ్ట్ బ్లాక్5 సీట్లతో సరిపెట్టుకోవలసివచ్చింది.. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఏడీ, చెగాతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేయడానికి నిరాకరించి, తన స్థానాన్ని 50 సీట్లకు మెరుగుపరుచుకుంది.
తాజా అభిప్రాయ సేకరణ ప్రకారం, అధికార పార్టీ ఏడీ 32 శాతం, సోషలిస్టుపార్టీ ( పీఎస్) 28 శాతం, చెగా 19 శాతం ఓట్లను పొందే అవకాశం ఉంది. అయితే పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ల వాటా 5 శాతం కంటే తక్కువగానే ఉంది. దీని అర్థం ఏడీ, పీఎస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. 2024 ఎన్నికలతో పోలిస్తే ఏడీ చాలా మెరుగ్గా ఉంది. ఏడీ 28 శాతం ఓట్లను పొందగా, పీఎస్ 27 శాతం ఓట్లను పొందింది. గత జాతీయ ఎన్నికల తర్వాత పోర్చుగల్‌లో రాజకీయ దృశ్యం జర్మనీతో కొన్ని సారూప్యతలను కలిగి ఉంది, ఇక్కడ అతిపెద్ద పార్టీ సీడీయూ ఫార్ రైట్ ఏఎఫ్‌డీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, కానీ సీడీయూ గత పాలక సోషల్ డెమోక్రటిక్ పార్టీ, గ్రీన్స్ అనే మూడు పార్టీల సంకీర్ణంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సీడీయూ నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ ఈ సంవత్సరం మే 7న జర్మన్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో పాటు ఫార్ రైట్ ఏఎఫ్‌డీతో కూడా పోరాడతానని హామీ ఇచ్చారు.
పోర్చుగీసులో కొత్త ప్రధాన మంత్రి లూయిస్ మోంటెనెగ్రో నేతృత్వంలోని ఏడీ ప్రభుత్వం మార్చి 2024లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాన మంత్రి, అతని కుటుంబంతో సంబంధం ఉన్న ఒక పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2021లో ప్రధాన మంత్రి స్థాపించిన డేటా ప్రొటెక్షన్ కన్సల్టెన్సీ సంస్థ స్పినమ్‌వివాపై పోర్చుగీస్ ప్రెస్ నివేదిక ప్రకారం, మోంటెనెగ్రో రాజకీయ నేపధ్యంలేని వ్యాపారవేత్త మాత్రమే. అయితే ప్రధానమంత్రి పదవిచేపట్టిన మరుసటి సంవత్సరం అతను కంపెనీ యాజమాన్యాన్ని తన భార్య, కుమారులకు బదిలీ చేశాడు. మోంటెనెగ్రో ప్రధానమంత్రిగా అత్యంత లాభార్జన పొందాడన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానికి వ్యతిరేకంగా చెగా గ్రూప్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటరీ అభిశంసన తీర్మానాలను దాఖలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. చివరకు మాంటెన్‌గ్రో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మే 18న ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం ప్రక్రియలో ఉండగా పోర్చుగీస్ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ ఎన్నికలపై యూరోపియన్ యూనియన్ దేశాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రంప్ వివిధ యూరోపియన్ దేశాలలో ఫార్‌రైట్ పార్టీల విస్తరణకోసం ప్రోత్సహిస్తున్నారు. పోర్చుగల్‌లో ట్రంప్ ఫార్ రైట్ చెగాకు మద్దతు ఇస్తున్నారు,
‘‘యూరప్‌లో ఎన్నికలకు పోర్చుగల్ ఒక ప్రయోగశాల’’ గా పోర్చుగల్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఆంటోనియో కోస్టా నాయకత్వంలో, సోషలిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీతో సహా వామపక్ష పార్టీల మద్దతుతో చాలా సంవత్సరాలు ప్రభుత్వం నడిచింది. ఇది ట్రేడ్ యూనియన్లలో చాలా బలంగా ఉన్న పార్టీ. మాజీ ప్రధానమంత్రి కోస్టాస్ ప్రజలలో అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. కోవిడ్ కాలంలో పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను విజయవంతంగా నడిపించారు. పోర్చుగల్ ఆర్థిక పనితీరును ఈయూతో సహా అన్ని దేశాల ఆర్థిక సంస్థలు కూడా ప్రశంసించాయి. భారతదేశంలోని గోవాలో తన వంశపారంపర్యతను కలిగి ఉన్న 63 ఏళ్ల ఆంటోనియో కోస్టా 2015 నుంచి పోర్చుగల్ ప్రధానమంత్రిగా పరిపాలించారు. జనవరి 30, 2022 ఎన్నికల తర్వాత సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని చివరి ప్రభుత్వం ఏర్పడిరది, సోషలిస్ట్ పార్టీ 230 మంది సభ్యుల పార్లమెంటులో సొంతంగా మెజారిటీని పొందింది. ఇతర వామపక్ష పార్టీలపై ఆధారపడకుండా పాలించింది. నవంబర్ 7, 2023న ఆయన రాజీనామా చేసిన తర్వాత, అధ్యక్షుడు మార్చి 10, 2024న ఎన్నికలను ప్రకటించారు, ఇది ప్రస్తుత పాలక ఏడీ ప్రభుత్వానికి దారితీసింది.
2024 మార్చి 10న జరిగిన ఎన్నికలు లెఫ్ట్ బ్లాక్, కమ్యూనిస్ట్ పార్టీల సీట్లు మరింతగా దిగజారాయి. పోర్చుగీసు కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) 4 సీట్లు, లెఫ్ట్ బ్లాక్ 5 సీట్లు వచ్చాయి. అంతకుముందు వామపక్షాలు మూడవ అతిపెద్ద నమోదయ్యాయి. జనవరి 2022 ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది.