Tuesday, May 27, 2025
Homeవ్యాపారంజీకేబీ ఆప్టికల్స్‌ షోరూమ్‌లలో రే-బాన్‌ మెటా ఏఐ గ్లాసెస్‌

జీకేబీ ఆప్టికల్స్‌ షోరూమ్‌లలో రే-బాన్‌ మెటా ఏఐ గ్లాసెస్‌

ముంబయి : భారతదేశంలోని ప్రముఖ ప్రీమియం ఐవేర్‌ రిటైల్‌ చైన్‌ జీకేబీ ఆప్టికల్స్‌ దేశవ్యాప్తంగా తన జీకేబీ స్టోర్లలో విప్లవాత్మకమైన రే-బాన్‌ మెటా ఏఐ గ్లాసెస్‌ను ప్రారంభించింది. రే-బాన్‌, మెటా సంస్థలు కలిసి రూపొందించిన ఈ ఆధునిక వేరబుల్‌ టెక్నాలజీ, అధునాతన ఏఐ-ఆధారిత ఫీచర్లను ఐకానిక్‌ శైలితో సమన్వయ పరిచింది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఇప్పుడు జీకేబీ ఆప్టికల్స్‌లో అందుబాటులో ఉంది. రే-బాన్‌ మెటా ఏఐ గ్లాసెస్‌ వినూత్న హ్యాండ్స్‌-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సులభంగా తీయగలరు, సంగీతం వినగలరు, కాల్స్‌ నిర్వహించగలరు, అలాగే తమ ఐవేర్‌ ద్వారా నేరుగా మెటా ఏఐతో సంభాషించవచ్చు. ఈ ఆధునిక ఉత్పత్తిని తన తెలివైన వినియోగదారులకు అందించే భారతదేశంలోని ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో ఒకటిగా జీకేబీ ఆప్టికల్స్‌ నిలిచిందని జీకేబీ ఆప్టికల్స్‌ డైరెక్టర్‌ ప్రియాంక గుప్తా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు