జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
విశాలాంధ్ర ` హైదరాబాద్ : టిబి రహిత తెలంగాణ, భారత్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, ప్రపంచ టీవీ దినోత్సవమును పురస్కరించుకొని హైదరాబాద్ చేస్తా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, టీబీ కేసులను గుర్తించి త్వరగా నివేదించడం మరియు క్షయవ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడం అత్య వసరమని స్పష్టం చేశారు. ‘‘హైదరాబాద్‌ను క్షయవ్యాధి రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సహకరించాలి. టీబీ వ్యాధిని సమర్థవంతంగా నియం త్రించడానికి ప్రారంభ దశలోనే గుర్తించడం, సరైన మోతదులో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా, బాధితులు భయపడకుండా, వివక్ష లేకుండా సరైన చికిత్స పొందేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అని ఆయన పేర్కొన్నారు. టీబి రహిత హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలన్నీ తప్పనిసరిగా తమ దగ్గర నమోదైన టీబీ కేసులను అధికారికంగా ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతి ఆరోగ్య సంరక్షణ కేంద్రం, ప్రైవేట్ వైద్యులు కూడా టీబీ కేసులను నమోదుచేయడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాకుండా చట్టబద్ధమైన కర్తవ్యమని, ని- క్షయ్ పోర్టల్ లో 150 శాతం నమోదు చేసేలా లక్ష్యం నిర్దేశించు కొని చురుకుగా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా బాగా సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, డా.రాజేశ్వరి, డా.స్నేహ శుక్లా మాట్లాడుతూ టీబీ వ్యాధి ప్రబలుతున్న తీరును, అలాగే అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న వ్యూహాలను వివరించారు. డా.శ్రవణ్ కుమార్ ఛెస్ట్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా పద్ధతుల గురించి వివరించారు. టిబి సంస్థ డైరెక్టర్ రమేష్ ప్లాన్ ఇండియా, మహావీర్ పీపీఎం ఎన్జిఓ, బవ్యా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తమ సామాజిక సేవా కార్యక్రమాలను, రోగుల పునరావాసం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలపై వారి కృషిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, మరియు సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని, టీబీ నిర్మూలనకు తమ కృతనిశ్చయాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించేం దుకు, టీబీ కేసుల నివేదికలను బలోపేతం చేయడానికి, మరియు క్షయవ్యాధిపై ఉన్న అపోహలను తొలగించ డానికి కృషి చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జే.వెంకటి, రాష్ట్ర మహమ్మారి శాస్త్రవేత్త డా.రాజేశ్వరి, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డా.స్నేహ శుక్లా, ఛెస్ట్ హాస్పిటల్ సూపరింటెం డెంట్ డా.శ్రవణ్ కుమార్, టి.బి.అలర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మిస్టర్ రమేష్, అలాగే ప్లాన్ ఇండియా ఎన్.జి.ఓ, మహావీర్ పిపిఎం ఎన్.జి.ఓ, బవ్యా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్.టి.ఈ.పి.) సిబ్బంది పాల్గొన్నారు. జె.ఎం.జె. నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.