Monday, March 3, 2025
Homeవిశ్లేషణట్రంప్‌ అనాగరిక, అమానవీయ పోకడలు

ట్రంప్‌ అనాగరిక, అమానవీయ పోకడలు

అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ తన ‘అమెరికా ప్రథమం’ అనే ఏకపక్ష విధానాలతో ప్రపంచ వాణిజ్యాన్ని ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాడు. ఏకపక్షంగా విధించే అధిక పన్నులు (ఎగుమతులపై) ఆయా దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించి, నిరుద్యోగాన్ని పెంచి, మరింత పేదరికంలో 3 కెప్ట్‌ సామ్రాజ్యవాద కుతంత్రాలకు పరాకాష్ఠ. బహుశా గతంలో మనం పాత అమెరికా సినిమాల్లో చూసిన గ్రామాలను, వ్యాపారులను దాచుకొని కౌబాయి పాత్రలను గుర్తు చేస్తున్నాయి.

డా॥ సోమ మర్ల
పూర్వకాలంలో చక్రవర్తులు తమ సామంత రాజులను పిలిపించి వారి నుంచి అధిక పన్నులు, కప్పాలు ఏకపక్షంగా వసూలు చేసేవారు. లేదంటే వారి రాజ్యాలను సైతం ఆక్రమించుకునేవారు. అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ తన ‘అమెరికా ప్రథమం’ అనే ఏకపక్ష విధానాలతో ప్రపంచ వాణిజ్యాన్ని ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాడు. ఏకపక్షంగా విధించే అధిక పన్నులు (ఎగుమతులపై) ఆయా దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించి, నిరుద్యోగాన్ని పెంచి, మరింత పేదరికంలో 3 కెప్ట్‌ సామ్రాజ్యవాద కుతంత్రాలకు పరాకాష్ఠ. బహుశా గతంలో మనం పాత అమెరికా సినిమాల్లో చూసిన గ్రామాలను, వ్యాపారులను దాచుకొని కౌబాయి పాత్రలను గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం విశ్వవాప్తంగా అమలు అవుతున్న ఉదారవాద ఆర్థిక విధానాల సంక్షోభ నేపథ్యంలో పెట్టుబడిని బాహాటంగా సమకూర్చుకొనే (ఆదిమ సంచయనం) పెట్టుబడిదారీ కుతంత్రమే నేటి ట్రంప్‌ విధానాలు.
పలస్తీన్‌ గాజాను, గ్రీన్‌ల్యాండ్‌, పనామా కాలువల స్వాధీనానికి ఉక్రెయిన్‌, రష్యాల్లోని అపారమైన ఖనిజ సంపదను తస్కరించే ప్రయత్నాలు, పదిహేడు, పద్దెనిమిదవ శతాబ్దాల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాదుల వలసల ఆక్రమణ, కలప, ఖనిజ సంపదను కాజేసి ఇండియాఆఫ్రికాను పేదరికంలోకి నెట్టివేసిన రోజులు గుర్తుకు తెస్తున్నాయి. రెండు శతాబ్దాల క్రితం మన దేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ, తదుపరి బ్రిటన్‌ ప్రభుత్వం మన దేశంలో ఆనాడున్న పరిశ్రమలను చేనేత వస్త్రాలు, లోహ పరిశ్రమలను, నౌకా నిర్మాణాన్ని ఎలా నాశనం చేసిందో ప్రముఖ కాంగ్రెస్‌ నేత, గ్రంథకర్త శశిథరూర్‌ తన ‘చీకటి యుగం’ (2016) గ్రంథóంలో వివరిస్తాడు. ఆనాడు దేశం నుంచి బ్రిటన్‌కు ఎగుమతి చేసే పత్తి, చేనేత, లోహ పనిముట్లపై 84 శాతం పన్ను, తిరిగి మాంచెస్టర్‌లో తయారైన వస్త్రాలను కేవలం 5 శాతం పన్ను విధించి, ఆయా పరిశ్రమలను, వృత్తిదారులను ఎలా నాశనం చేసిందో వివరిస్తాడు. పద్దెనిమిదవ శతాబ్దపు మధ్య వరకు 40 శాతం కార్మికులు పట్టణాల్లో చేనేత, లోహ పనిముట్లు, ఓడల నిర్మాణంలో పనిచేస్తూ ప్రపంచ సంపదలో 24.4 శాతంగా నుండే ది.హిందుస్థాన్‌ ఆనాడు కానీ 1903వ సంవత్సరానికి 62.4 శాతానికి కొంత కోలుకున్న పారిశ్రామికోత్పత్తి ఈనాడు ప్రధాని మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాల ఫలితంగా 13 శాతానికి పడిపోయింది. ఎనభైయ్యవ దశకంలో రోనాల్డ్‌ రీగన్‌ మార్గరెట్‌ ధరలు, ప్రపంచ యుద్ధానంతరం కొనసాగుతూ వస్తున్న కీన్స్‌ తరహా సంక్షేమం ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఉదారవాద ఆర్థికవాదాన్ని మొత్తం ప్రపంచ దేశాలపై రుద్దేశారు. ఫలితంగా ప్రభుత్వ రంగంలోని అనేక పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు ప్రైవేటీకరించి దేశంలోని గుత్తపెట్టుబడిదారులను, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టాయి. ఫలితంగా నేడు నెలకొన్న తీవ్ర అసమానతలు, నిరుద్యోగం, పేదరికాన్ని మనం ఈనాడు అనుభవిస్తున్నాం. కాగా సోవియట్‌ యూనియన్‌ పతనంతో అమెరికా ప్రపంచంలో ఏక ధృవ శక్తిగా ఆవిర్భవించింది. గత శతాబ్దపు ఇరాక్‌, ఆఫ్గానిస్థాన్‌ తదితర సామ్రాజ్యవాద యుద్ధాల నుంచి, తమ ఆయుధ పరిశ్రమల నుంచి కుప్పలు తెప్పలుగా లాభాలు లభించినా, విపరీతమైన సంపద పోగుపడటం, పెరిగిన అసమానతల కారణంగా 2008 వ సంవత్సంలో వచ్చిన లేహన్‌ బ్రదర్స్‌ ఆర్థిక సంక్షోభానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ గురైంది. కాగా అమెరికా ఆర్థికవ్యవస్థ హైటెక్‌ పరిశ్రమలు (గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇంటెల్‌ చీఫ్‌, తదితరాలు) కొంతవరకు కోలుకొన్నా నికర లాభాలు బాగా తగ్గాయి. ఏకధృవ శక్తికి బ్రిక్స్‌, అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన చైనా ఆర్థికవ్యవస్థ, కొంతవరకు నిలదొక్కుకున్న రష్యా, ఇండియా, బ్రెజిల్‌, ద.ఆఫ్రికా దేశాలు సవాల్‌గా మారాయి. ఏకధృవ వ్యవస్థను ఈ దేశాలు బహళధృవ (మల్టీపొలార్‌) రూపంలో గట్టి పోటీని, డాలరు కరెన్సీ వినియోగాన్ని ప్రశ్నించే స్థాయికి పెరిగాయి. దీనితో బెంబేలెత్తిన నూతన తరం గుత్త పెట్టుబడిదారులైన ఎలన్‌ మస్క్‌, గూగుల్‌ లాక్‌హీడ్‌ వంటి ఆయుధ పరిశ్రమలు ట్రంప్‌ను అధికారంలోకి తెచ్చి బాహాటంగా పెట్టుబడిని సమీకరించే (ఆదిమ సంచ మనం) ఆర్థిక వ్యవస్థను ప్రపంచ తెరపైకి తెచ్చాయి.
కారల్‌మార్క్స్‌ మాటల్లో ‘పెట్టుబడిదారి అభివృద్ధిలో సంపద విపరీతంగా కొద్దిమంది చేతుల్లోకి చేరినప్పుడు, మితిమీరిన పెట్టుబడి సమీకరణ ఫలితంగా ఇది లాభదాయకమైన పెట్టుబడులకు ఏ మాత్రం తోడ్పడదు. లాభాలకై కొత్త పరిశ్రమలను స్థాపించలేని ఈ దశ తీవ్రమైన సంక్షోభానికి గురవుతుంది. ఇది మరోరూపంలో లాభాన్వేషణకు కొత్త పద్ధతులకు పురికొల్పుతుంది’’. ప్రస్తుతం అధిక లాభాలను చేకూర్చలేని ప్రపంచీకరణ, నయా ఆర్థిక విధానాల స్థానంలో మానవ, కార్మిక హక్కులను, కొంత వరకు స్వేచ్చా వాణిజ్యాన్ని కాలరాసి అనాగరికమైనదైనా బాహాటంగా పెట్టుబడిని వెనుకేసుకునే యుద్ధ నేపథó్యంలో విధించిన ఆంక్షల నుంచి తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి, నూతన టెక్నాలజీ కొరకు చైనాపై ఆధారపడుతున్నది. ఈ నేపథó్యంలో రష్యా నుంచి చైనాను విడదీయటం ట్రంప్‌కు అంత సులువు గాదు.
ట్రంప్‌ నెగ్గుకు రాగలడా?
స్వదేశంలో సైతం ఒక నెల రోజుల్లోనే ట్రంప్ర్‌పై తీవ్రమైన అసంతృప్తి మొదలయింది. ప్రజాదరణ 40 శాతానికి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగులను, కార్మికులను తొలగించటం, వివిధ సంస్థలను, యు.ఎస్‌. ఎయిడ్‌ వంటి మానవతా సహాయ సంస్థలకు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలకు ఆహార, ఆరోగ్య పథకాలకు నిధులు తొలగించటం, స్వదేశంలో ధనికులకు ఆదాయంపై పన్నులను తొలగించడం, కెనడా, ఐరోపా దేశాలతో వైరం వంటి చర్యలు ఈ అసమ్మతికి కారణాలు.
స్వదేశంలో వికలాంగుల, ట్రాన్సజెండరు, స్త్రీల హకులను త్యజించటం, ఆరోగ్యబీమా వంటి సంక్షేమ పథకాలకు, కార్మికులు కనీస వేతనాల పెంపు నిరాకరణ, అక్రమ వలసదారులను క్రూరంగా అధిక వ్యయంతో వారి దేశాలకు తిరిగి పంపటం కూడా ప్రజా అసమ్మతికేకాక, ఆర్థిక భారాన్ని మరింత పెంచుతాయి.
ప్రస్తుత ట్రంప్‌ ఆర్థిక విధానాలు ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గం, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ముప్పేట దాడిగా గుర్తించాలి. ఈ శక్తులు ఐక్యంగా సామ్రాజ్యవాద నూతన దోపిడీ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం చేయవచ్చిన తరుణమిది. ప్రస్తుతం గత రెండు శతాబ్దాలతో స్పానిష్‌ నాగరికత వారిలో పెరిగింది. మానవ హక్కులు గుర్తించటమైనది. సైన్సు, అక్షరం ఒకే దేశానికి పరిమితం కాక విశ్వవ్యాప్తం అయ్యాయి. పెద్దదైనా, చిన్నదైనా ప్రతిదేశం పరస్పర సహకారం, గౌరవంతో మనుగడ సాగించవల్సిన కాలమిది. ఇట్టి పరిస్థితుల్లో అనాగరికత, అమానవీయమైన ట్రంప్‌ పోకడలు, విధానాలు ఎల్లకాలం మనజాలవు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు