Friday, April 18, 2025
Home‘తిరుపతి`కాట్పాడి’ రైల్వే లైన్‌ డబ్లింగ్‌

‘తిరుపతి`కాట్పాడి’ రైల్వే లైన్‌ డబ్లింగ్‌

. రూ.1,332 కోట్లు మంజూరు
. సీఏడీడబ్ల్యూఎం పథకానికి ఓకే
. రైల్వే ఇన్ఫ్రాకు రూ.1,875 కోట్లు…
. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.1600 కోట్లు
. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం రెండు రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనా డులో 104 కిమీల తిరుపతిపాకాలా కాట్పాడి రైల్వే లైన్‌ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో పంజాబ్‌హర్యానా మధ్య 19.2 కిమీల జిరాక్పూర్‌ బైస్‌ అధీనంలోని ఆరు లేన్ల నిర్మాణానికి అంగీకరించింది. రూ.1,878 కోట్ల రైల్వే ఇన్ఫ్రా, రూ.1600 కోట్ల ఇరిగేషన్‌ ప్రాజెక్టులనూ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం భేటీ అయింది. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తమిళనాడు మధ్య తిరుపతిపాకాలాకాట్పాడి సింగిల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టును ఆమోదిస్తూ, ఇందుకోసం రూ.1,332 కోట్లను మంజూరు చేసింది. ప్రధానమంత్రి క్రిషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) ఉప పథకంలో భాగంగా 202526 కోసం రూ.1,600 కోట్లతో కమాండ్‌ ఏరియా అభివృద్ధి, జల నిర్వహణ (ఎంసీఏడీడబ్ల్యూఎం)కు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడిరచారు. తిరుపతిపాకా లా కాట్పాడి డబులింగ్‌ ప్రాజెక్టు వల్ల తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట వంటి ప్రముఖ క్షేత్రాలకు వచ్చే లక్షలాది భక్తులకు ప్రయోజనం ఉంటుందన్నారు. వైద్య, విద్య హబ్‌లుగా తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు ఉంటే రవాణా సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 17 ప్రధాన వంతెనలు, 327 చిన్న వంతెనలు, ఏడు పై వంతెనలు, 30 అండర్‌పాస్‌లను నిర్మించనున్నట్లు వైష్ణవ్‌ తెలిపారు. డబ్లింగ్‌ పనులు పూర్తైతే రోడ్డు మార్గంలో రద్దీ తగ్గుతుందని, రైలు మార్గం ఎక్కువగా వినియోగమవుతుందని అన్నారు. తద్వారా 20 కోట్ల కిలోల కబ్బన ఉద్గారం తగ్గుతుందని చెప్పారు. నాలుగు కోట్ల లీటర్ల డీజిల్‌ ఆదా అవుతుందని కూడా అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తి అయినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ 113 కిమీల మేరకు విస్తరిస్తుందని చెప్పారు. అలాగే, రూ,1,878 కోట్ల వ్యయ అంచనాతో పంజాబ్‌హర్యానాలో ఎన్‌హెచ్‌7 (జిరాక్పూర్‌పాటియాలా) నుంచి ఎన్‌హెచ్‌5 (జిరాక్పూర్‌పర్వానూ) వరకు 19.2 కిమీల ఆరు లేన్ల జిరాక్పూర్‌ బైపాస్‌కు కేబినెట్‌ ఆమోదం లభించినట్లు వెల్లడిరచారు. పాటియాలా, దిల్లీ, మొహాలీ ఎయిరో సీటీ నుంచి ట్రాఫిక్‌ మళ్లించడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు, జిరాక్పూర్‌, పంచ్‌కులా వద్ద రద్దీ తగ్గించడానికి ఈ ప్రాజెక్టు దోహదమవుతుందని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌తో నేరుగా అనుసంధానం అవుతుందన్నారు. ఎన్‌హెచ్‌7, ఎన్‌హెచ్‌5, ఎన్‌హెచ్‌5 మీద రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఐఎంటీ) ద్వారా వాటర్‌ యూజర్‌ సొసైటీ (డబ్ల్యూయూఎస్‌) కోసం ఇరిగేషన్‌ ఆస్తుల నిర్వహణ ప్రాజెక్టునూ కేబినెట్‌ ఆమోదించింది. ప్రస్తుతమున్న కాలువలు, ఇతర నిర్దేశిత క్లస్టర్‌ల నుంచి నీటి సరఫరాకు అనుకూలమైన మౌలిక వసతుల కల్పనకు ఈ ప్రాజెక్టును కేబినెట్‌ ఆమోదించినట్లు వైష్ణవ్‌ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీలు), వ్యవసాయోత్పత్తుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) వంటి వాటితో అనుసంధానం ద్వారా వాటర్‌ యూజర్‌ సొసైటీలకు ఐదేళ్ల దాకా సహకారం లభిస్తుందని అన్నారు. నీటిపారుదల ఆధునిక పద్ధతులను అనుసరించడంతో యువతను వ్యవసాయం వైపున కు ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. దేశంలోని వివిధ ఆగ్రోక్లైమేట్‌ జోన్లలో 78 పైలట్‌ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం లభించింద న్నారు. ఈ ప్రాజెక్టుల ప్రయోగాత్మక అమలు తో పొందే అనుభవం ఆధారంగా 16వ ఆర్థిక కమిషన్‌ కాలంలోనే 2026, ఏప్రిల్‌ నుంచి కమాండ్‌ ఏరి యా అభివృద్ధిజల నిర్వహణ జాతీయ ప్రాణాళిక విడుదలవుతుందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిరచారు.
చంద్రబాబు కృతజ్ఞతలు
తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డబ్లింగ్‌ పనులు చేపట్టేందుకు రూ.1,332 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘డబ్లింగ్‌ పనులకు ఆమోదం తెలిపి రూ.1,332 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటను అనుసంధానం చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా వైద్యం, విద్యా రంగాల్లో వెల్లూరు, తిరుపతికి మరింత ప్రాధాన్యత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఏపీలోని సిమెంట్‌, స్టీల్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల పురోగతిని మరింత వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లైన్‌ కనెక్టివిటీలో నూతన శకానికి నాంది పలికినట్లు అవుతుంది’’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు