Saturday, March 29, 2025
Homeఅంతర్జాతీయంత్వరలో భారత్‌కు పుతిన్‌

త్వరలో భారత్‌కు పుతిన్‌

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ త్వరలో భారత్‌ రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్‌ పర్యటనకు పుతిన్‌ అంగీకరించినట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వెల్లడిరచారు. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయన్నారు. అయితే పుతిన్‌ ఏ తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారన్నది మాత్రం చెప్పలేదు. ‘రష్యా Ê భారత్‌ : ద్వైపాక్షిక అజెండా దిశగా’ పేరుతో రష్యా అంతర్జాతీయ వ్యవహారాల మండలి నిర్వహించిన సదస్సులో పుతిన్‌ భారత్‌ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు లావ్రోవ్‌ తెలిపారు. మోదీ తొలి అంతర్జాతీయ పర్యటనగా రష్యాకు వెళ్లడాన్ని గుర్తుచేశారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మూడు సార్లు రష్యా వచ్చారు. ఇక మా వంతు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని లావ్రోవ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాల విధింపు, ఉక్రెయిన్‌తో రష్యా పోరు నేపథ్యంలో పుతిన్‌ భారత్‌ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు