Tuesday, April 22, 2025
Homeవిశ్లేషణదుబేపై సుప్రీం చర్య అవశ్యం

దుబేపై సుప్రీం చర్య అవశ్యం

అరుణ్‌ శ్రీ వత్సవ

తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలపైన బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించడానికి తమ పార్టీ బాస్‌ల అనుమతిలేకుండా మాట్లాడి ఉండరనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘గుర్తు తెచ్చుకోండి`తమ యజమాని ఆదేశాలు లేకుండా తానుపోషించే కుక్క ఏమీ చేయదు’’ అని పశ్చిమబెంగాల్‌ ఎంపీ మహువామొయిత్రి చెప్పినమాటలు సబబైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల అనుమతిలేనిదే ఏ నాయకుడు చివరికి వారిస్థాయి ఉన్న నాయకుడు కూడా సున్నితమైన అంశాలపై మాట్లాడేందుకు సాహసించడు. గడచిన శనివారం దుబే సుప్రీంకోర్టును తీవ్రంగా విమర్శించారు. సుప్రీంకోర్టు ‘‘న్యాయపరమైన వంచనకు’’ పాల్పడిరదని దుబే దూషించాడు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే దేశంలో పార్లమెంటుతో అవసరమే ఉండదు. ఉన్నత న్యాయస్థానం ఒక దయ్యం లాంటిదని దుబే ఆలోచనగా ఉంది. వక్ఫ్‌ చట్టాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత రోజు దుబే ఈ మాటలన్నీ మాట్లాడాడు. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు తగినచర్య దుబేపై తీసుకోవాలి. లేకపోతే పాలకపార్టీ న్యాయస్థానాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తుంది.
మే 5వ తేదీన వక్ఫ్‌ చట్టంపై తదుపరి విచారణ జరిగేవరకు ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ చట్టంలోనే కొన్ని విభాగాలను అమలు జరపబోనని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లవేళలా సవాలు చేస్తూనే ఉంటుంది. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరూ కూడా మోదీ అధికారాన్ని ఇంతవరకు ప్రశ్నించలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మోదీ బహిరంగంగా తిరస్కరించలేదు. దేశంలోని వివిధప్రాంతాలలో జరిగిన బహిరంగ సభల్లో మోదీ మాట్లాడుతూ, వక్ఫ్‌ బిల్లు రాజకీయంగా సరైందేనని అన్నారు. అయితే, బీజేపీ నాయకత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా మాట్లాడాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యూహంలోభాగమే దుబే నిరంకుశ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో పాలించే ప్రభుత్వ సందేశం అని దుబే వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ సుప్రీం కోర్టును లక్ష్యంగా చేసుకోవడానికి తనపదవికి ఉన్న గౌరవం దిగజారిపోయినా ఆయన పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ ప్రయోజనాలను రక్షించడమే ధన్కర్‌ లక్ష్యం. వక్ఫ్‌ బిల్లును ఏ విధంగానైనా ఆమోదింపచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ధన్కర్‌ సుప్రీంకోర్టు గౌరవాన్ని నిలపాలన్న ఆలోచనకూడా లేకుండా ఆ కోర్టుపై ఇష్టంవచ్చినరీతిలో వ్యాఖ్యానించారు.
తాను రాజ్యాంగపదవిలో ఉన్నానన్న విషయాన్ని కూడా ధన్కర్‌ మరచిపోయారు. మరో రాజ్యాంగ సంస్థ దూషిస్తూ మాట్లాడకూడదని తప్పనిసరిగా గర్తించాలి. రాజ్యసభలో మాట్లాడకూడని విధంగా ధన్కర్‌ మాట్లాడుతూ న్యాయమూర్తులు న్యాయమూర్తులే ‘‘సూపర్‌ పార్లమెంటు’’ అని అన్నారు. వాస్తవంగా ధన్కర్‌ న్యాయవాదిగా పనిచేశారు. అందువల్ల పార్లమెంటు అమోదించిన ఏ చట్టాన్నయినా పరిశీలించేందుకు న్యాయపరిధిలోగల హక్కుతోనే మాట్లాడాలి. ఈ విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ఆర్టికల్‌ 142ను సైతం ఆయన కఠినంగా మాట్లాడారు. ఈ ఆర్టికల్‌ ‘‘ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగాగల అణుక్షిపణి’’ అని వ్యాఖ్యానించారు. ధన్కర్‌ ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయడం నేరం. దుష్ట ఆలోచనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోంది. ఆయన బీజేపీ టిక్కెట్టుపైన గెలవలేదు. రెండు పదవులు పొందానని, రాజ్యాంగ బాధ్యతలు కూడా ఈ పదవిద్వారా లభించాయన్న విషయాన్ని ఆయన మరచిపోరాదు. రాజ్యాంగ పరమైన బాధ్యతలను విస్మరించరాదు. దేశాన్ని కేవలం రాజకీయ సమర్ధత ఉన్న రాజకీయ నాయకత్వం మాత్రమే పరిపాలిస్తుందన్న అంశం సరైందికాదు. మోదీ సైతం వక్ఫ్‌ బిల్లుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడకుండా ఉండాలి. ఈ విషయంపై ఆయన మౌనంగా ఉంటే సరిపోతుంది. వివిధ సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టుతో జగడం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సాధారణంగా భావిస్తారు. సుప్రీంకోర్టు సమగ్రమైన ఉత్తర్వును జారీచేసేవరకు మోదీ సహనంతో ఉండవలసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు