Saturday, March 29, 2025
Homeఅంతర్జాతీయందురాక్రమణలు లేని ప్రపంచం కావాలిన్యూ

దురాక్రమణలు లేని ప్రపంచం కావాలిన్యూ

న్యూ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ యుగోస్లేవియా

బెల్‌గ్రేడ్‌: దోపిడీ, దురాక్రమణలు లేని స్వేచ్ఛా ప్రపంచం సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని న్యూ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ యుగోస్లేవియా (ఎన్‌కేపీజే) పిలుపునిచ్చింది. 1999లో మార్చి 24 నుంచి జూన్‌ 10 వరకు సాగిన నాటో బాంబుల దాడికి 26 ఏళ్లు అయిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది. ‘మనం అనుభవించిన వేదనను గుర్తుచేసుకుందాం. స్వేచ్ఛా ప్రపంచం సాధన కోసం మన వంతు కృషి చేద్దామ’ని ఏన్‌కేపీజే పిలుపునిచ్చింది. నిజమైన శాంతి, సుస్థిరత, సామరస్యత సాధన కోసం కలిసి రావాలని కోరింది. మానవుల దోపిడీని అరికట్టేందుకు, దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు, పెట్టుబడిదారీ పెత్తనాన్ని అంతం చేసేందుకు పోరాడాలని ఉద్ఘాటించింది. సంఫీుభావం, న్యాయం, విప్లవాత్మక నిబద్ధత ద్వారానే న్యాయమైన సమాజాన్ని స్థాపించుకోగలమని వక్కాణించింది. గత గాయాలు మానాలన్నా, ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా అన్ని దేశాలు, సమాజాలు కలిసి పోరాడితేనే నిజమైన సామరస్యత సాధించడం సాధ్యమవుతుందని న్యూ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ యుగోస్లేవియా పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు