Monday, February 3, 2025
Homeజాతీయందేవుడు లేదా మోదీనే చేయగలరు!

దేవుడు లేదా మోదీనే చేయగలరు!

లోక్‌సభలో బీజేపీ ఎంపీ బిధూరి

న్యూదిల్లీ: సోమవారం లోక్‌సభ దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు యుద్ధభూమిగా మారింది. బీజేపీ సభ్యుడు రాంవీర్‌ సింగ్‌ బిధూరి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వంపై తీవ్ర దాడి చేశారు. దేశ రాజధానిని ‘దోచుకుని’ దానిని ‘నరకం’గా మార్చారని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను బిధూరి ప్రారంభిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల జాబితాను చదివి వినిపించారు. ఆప్‌ ప్రభుత్వం దిల్లీ ప్రజలకు గృహ నిర్మాణం, రవాణా, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రయోజనాలను అందకుండా చేసిందని ఆరోపించారు. దక్షిణ దిల్లీకి చెందిన లోక్‌సభ సభ్యుడు… కాంగ్రెస్‌ సభ్యులను కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. యమునా నది ఒడ్డున జీవవైవిధ్య ఉద్యానవనాలను నిర్మించడం, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఎక్స్‌ప్రెస్‌ వేలు, జాతీయ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులను బిధూరి చెప్పుకొచ్చారు. ‘భగవంతుడు భూమిపైకి దిగి వస్తేనే అలాంటి పని సాధ్యమవుతుంది లేదా అలాంటి అద్భుతాలు మోదీ జీ మాత్రమే చేయగలరు. మరెవరూ చేయలేరు’ అని బిధూరి అన్నారు. ఫిబ్రవరి 5న దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికలు ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీగా ఉన్నాయి. ‘ఆప్‌ ప్రభుత్వం దిల్లీని దోచుకుని నరకంగా మార్చింది. ఫిబ్రవరి 8న మోదీ మార్గదర్శకత్వంలో బీజేపీ 50కి పైగా సీట్లు గెలుచుకుని దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రపంచ స్థాయి నగరంగా ఉండాలనే దేశ రాజధాని కలను నెరవేరుస్తుంది’ అని బిధూరి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు