విశాలాంధ్ర/హైదరాబాద్: 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ దార్శనికత దిశగా ఒక మైలురాయి అభివృద్ధిలో, దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, హైడ్రోజన్-శక్తితో నడిచే హెవీ-డ్యూటీ ట్రక్కుల మొట్టమొదటి ట్రయల్స్‌ను ప్రారంభించిందని ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో టాటా మోటార్స్ వెల్లడిరచింది. సుస్థిరమైన సుదూర కార్గో రవాణా వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచించే ఈ చారిత్రాత్మక ట్రయల్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఫ్‌ు, భారత ప్రభుత్వ, రెండు కంపెనీల నుండి ఇతర ప్రముఖ ప్రతినిధులు పాల్గొన్నారు.