Saturday, February 22, 2025
Homeహైదరాబాద్నాలాపై సమగ్ర సర్వే చేయాలి: కమిషనర్‌

నాలాపై సమగ్ర సర్వే చేయాలి: కమిషనర్‌

విశాలాంధ్ర ` హైదరాబాద్‌ : యాకుత్‌పురా మురికి నాలాపై సమగ్ర సర్వే చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం యాకుత్పురాలోని పలు స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌లను స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, కార్పొరేటర్‌లతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రంగేలి కిడికి, హుస్సేన్‌ కోటి, మౌలానా చిల్ల, గంగానగర్‌, రెయిన్‌ బజార్‌లలో పర్యటించారు. ముందుగా రంగేలి కిడికి వీధిలో మురుగు నీరు ఓవర్‌ ఫ్లోను పరిశీలించారు. జహంగీర్‌ నగర్‌ నుండి గంగా నగర్‌ మురికి కాలువ నిజాం కాలంలో చేపట్టిన నాలా అయినందున గత వర్ష కాలంలో వరదకు పొంగిపోయిన నేపథ్యంలో మురికి నీరు వస్తున్నాయని మెయింటెనెన్స్‌ ఈ ఈ కమిషనర్‌ కు వివరించడంతో మురుగు నీటీ నాలాపై సమగ్ర సర్వే చేయాలని, నిజాం కాలం నాటి మురికి కాలువ అయినందున నాలాల పరిస్థితి తెలుసుకోవలసిన అవసరం ఉందని మురుగు నాలా సమగ్ర సర్వే చేసి పూర్తి నివేదిక అందజేయాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మౌలానా చిల్ల వద్ద గంగా నగర్‌ నాలాను పరిశీలించారు. నాలా పనులు మూడేళ్లు నుండి చేస్తున్నందున పూర్తి కాలేదని ఎమ్మెల్యే కమిషనర్‌ కు వివరించారు. నాలా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అట్టి పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని కోరారు. నిధుల సమస్య లేదని పనులు నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నాలాలో చెత్త పేరుకుపోయి నీరు నిలిచి ఇళ్లలోకి రావడం వలన ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పడంతో వెంటనే తొలగించాలని ఆదేశించారు. రెయిన్‌ బజార్‌ ఎగ్జిస్టింగ్‌ బాక్స్‌ డ్రెయిన్‌లో వర్షపు నీరు వెళ్లక వరద నీటి నిలిచి పోవడంతో ఇళ్లకు నీరు వస్తుందని కాలనీ వాసులు కమిషనర్‌కు వివరించారు. బాక్స్‌ డ్రెయిన్‌ పనులు చేపట్టేందుకు రూ.1.60 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే కమిషనర్‌ ను కోరగా పని పూర్తి డీటైల్స్‌ రిపోర్ట్‌ పంపించాలని ఇంజనీరింగ్‌ అధికారిని ఆదేశించారు.
స్టార్మ్‌ వాటర్‌ నాలా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయండి..
రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ లాగానే, హైదరా బాద్‌ నగరం వర్షపు నీటి పారుదల క్రమబద్ధమైన అభివృద్ధి, నిర్వహణ విస్తరణను నిర్ధారించడానికి నాలా అభివృద్ధికి మాస్టర్‌ ప్రణాళిక అవసరమని కమిషనర్‌ తెలిపారు. ఇది వరద తగ్గింపు పరిష్క రించడంతో పాటు ఇప్పటికే ఉన్న నాలాలను కొత్త పట్టణ విస్తరణతో అనుసంధానించడానికి సహాయ పడుతుందన్నారు. పాత బస్తీలో ప్రజలకు ఇబ్బందు లు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఎస్‌ఎన్‌డిపి ద్వారా నాలా పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో రూ. 545 కోట్ల వ్యయంతో ఎస్‌.ఎన్‌.డి.పి రెండోదశ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేం దుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పాత బస్తీలో చేపట్టిన పనులు వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు