Homeఅంతర్జాతీయంనెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి

నెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి

- Advertisement -

ట్రంప్ చీవాట్లు: బీరుట్‌పై దాడులొద్దని సూచన
కాల్పుల విరమణకు హెజ్బుల్లా అంగీకరించినట్లు ప్రకటన

వాషింగ్టన్: తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండే వాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి నెతన్యాహుకు చీవాట్లు పెట్టారు. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. అయితే లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చలను కొనసాగించేది లేదని ఇరాన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసి మందలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నట్లు … పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతున్నట్లు ట్రంప్ మొట్టికాయలు వేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ‘నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను లేకపోయి ఉంటే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నా రక్షణలో ఉన్నారు కాబట్టి స్వేచ్ఛగా తిరగుతున్నాం… ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయిల్‌ను దూషిస్తున్నారు’ అని నెతన్యాహుపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా వెల్లడించింది.
నెతన్యాహు నిర్ణయాలను కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హెజ్బుల్లా కమాండర్‌ను హతమార్చే క్రమంలో అనేకమంది లెబనాన్ పౌరులను చంపడంపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. నెతన్యాహుతో ఫోన్ చర్చల గురించి ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. బీరుట్ దిశగా ఇజ్రాయిల్ సైన్యం వెళ్లదన్న హామీని ఇచ్చినట్లు తెలిపారు. హెజ్బుల్లా నేతల తోనూ రాజీ కుదర్చినట్లు వెల్లడించారు. కాల్పులు ఆపేందుకు వారు అంగీకరిం చారన్నారు. కాగా, హెజ్బుల్లా లక్ష్యంగా దాడులు ఆగబోవని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్‌కు ఇది తెలుస న్నారు. ఇద్దరు నేతల భిన్న ప్రకటనలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు