Friday, February 28, 2025
Homeఅంతర్జాతీయంనేపాల్‌, పాక్‌లో భూకంపం

నేపాల్‌, పాక్‌లో భూకంపం

భారత్‌, టిబెట్‌లోనూ ప్రకంపనలు

ఖాట్మండు: నేపాల్‌లో భారీ భూంకంపం వచ్చింది. రాజధాని ఖాట్మండు సమీపంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌లో 4.5 తీవ్రతో భూకంపం వచ్చింది. అలాగే టిబెట్‌, భారత్‌లోనూ కొన్ని చోట్ల స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. మధ్యరాత్రి 2.51 గంటలకు తమ ఇళ్లు ఊగిపోతుండటంతో గాఢనిద్రలో ఉన్న నేపాల్‌ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రాణ`ఆస్థి నష్టంపై ఆందోళనకు గురయ్యారు. ఖాట్మాండుకు తూర్పు దిశగా 65 కిమీల దూరంలో సింధూపల్‌ చౌక్‌ జిల్లా, భైరవ్‌కుండాలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంపం పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం నిర్థారించింది. అలాగే, పాకిస్థాన్‌లో శుక్రవారం ఉదయం 5.14 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు