Homeఅంతర్జాతీయంనేపాల్ ప్రధానిగా బాలేంద్ర?

నేపాల్ ప్రధానిగా బాలేంద్ర?

- Advertisement -

కాట్మండు: నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్‌పీ)’ అఖండ విజయం సాధిం చింది. ఆ పార్టీకి చెందిన జెన్ జీ నేత బాలేంద్ర షా (బాలెన్) నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకా శాలు కనిపిస్తున్నాయి. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలుండగా… వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానా లను దామాషా విధానంలో భర్తీ చేస్తారు. ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 165 స్థానాలకుగాను ఇప్పటివరకూ 159 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఆరఎస్‌పీ 122 సీట్లు గెల్చుకుంది. 17 సీట్లతో నేపాలీ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఎనిమిది స్థానాల్లో గెలుపొందగా… మరో రెండు చోట్ల అది ఆధిక్యంలో ఉంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. కాట్మండు లోయలోని మూడు జిల్లాల్లో మొత్తం 15 నియోజక వర్గాలను ఆరఎస్‌పీ క్లీన్‌స్వీప్ చేసింది. 35 ఏళ్ల బాలెన్ ప్రధాని పీఠమెక్కితే.. నేపాల్‌లో ఆ పదవిని అధిష్టించిన తొలి మాధేసీ నేతగా, అత్యంత పిన్న వయసు ప్రధానమంత్రిగా రికార్డు సృష్టిస్తారు. ఝాపా-5 నియోజకవర్గంలో కె.పి.శర్మ ఓలిని బాలెన్ 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఆరఎస్‌పీని 2022లో రవి లమిచానె స్థాపించారు. ఈ ఎన్నికల్లో ఆయన చిత్వాన్-2 నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గగన్ థాపా ధనుషా-4 నియోజకవర్గంలో ఆరఎస్‌పీ అభ్యర్థి అమరేశ్‌సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. థాపాను నేపాలీ కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి గమనార్హం. ఆ పార్టీ సీనియర్ నేతలు గురురాజ్ ఘిమిరె, శేఖర్ కోయిరాల, బిమలేంద్ర నిధి కూడా ఓడిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు