కరెస్పాండెంట్ శ్రీకాంత్, సంజీవరెడ్డి, హెడ్మాస్టర్ దాదా కలందర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్-జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను ఘనపరిచి విజయదుందుభి మోగించడం జరిగిందని కరెస్పాండెంట్ శ్రీకాంత్, సంజీవరెడ్డి హెడ్మాస్టర్ దాదా కలందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 100మందికి గాను 91 మంది విద్యార్థులు ఉత్తీర్ణతతో 91 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చిన వారిలో జి. వర్షా 591 మార్కులు, బి. దీక్షిత్ రెడ్డి 586 మార్కులు, ఎస్. జోత్స్న 584 మార్కులు, ఎం. శివ చరణ్ తేజ్ 581 మార్కులు తేవడం జరిగిందన్నారు. 550 మార్కులు పైగా 15 మంది విద్యార్థులు, 500 నుండి 549 వరకు 18 మంది విద్యార్థులు మార్కులు తేవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు ముగ్గురు విద్యార్థులు, గణితములో నూటికి నూరు మార్కులు ఒకరు, సామాన్య శాస్త్రములో నూటికి నూరు మార్కులు 6 మంది, సాంఘిక శాస్త్రములో నూటికి నూరు మార్పులు ఇద్దరు తేవడం జరిగిందన్నారు. అదేవిధంగా పదవ తరగతిలో 6 సబ్జెక్టులలో సామాన్య శాస్త్రం 81.9 శాతము, తెలుగులో 78.7 శాతము, తృతీయ స్థానంలో ఆంగ్లము 75 శాతము రావడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభ ఘనపరిచిన, ఉత్తీర్ణత చెందిన విద్యార్థులందరికీ కరెస్పాండెంట్ శ్రీకాంత్, సంజీవరెడ్డి, హెడ్మాస్టర్ దాదాకలందర్ తో పాటు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పాఠశాల కమిటీ తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు
RELATED ARTICLES