Wednesday, April 23, 2025
Homeజిల్లాలుఅనంతపురంపదవ తరగతి పరీక్షా ఫలితాలలో బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల ప్రభంజనం

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల ప్రభంజనం

హెడ్మాస్టర్ రాంప్రసాద్
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం జరిగిందని హెడ్మాస్టర్ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 173 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 132 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. మా పాఠశాలలో 594 మార్కులతో గుర్రం మనోజ్ కుమార్ మొదటి స్థానంలోనూ, 590 మార్కులతో ఉక్కిసల ఓబులేసు ద్వితీయ స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల కమిటీ చైర్మన్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు