మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు 2025 -26 సంవత్సరమునకు సంబంధించిన ఇంటి పన్నులు ఈనెల 30వ తేదీలోగా ఏక మొత్తంగా చెల్లించిన వారికి పన్ను మొత్తములో 5 శాతం రాయితీ ప్రకటించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గడువులోగా పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని వారు తెలిపారు. పన్నులను మున్సిపల్ కార్యాలయము నందు గాని, శివానగర్ పార్కు నందుగల సచివాలయంలో గాని, ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ పక్కనగల జేజేఆర్ నగర్ సచివాలయంలో గాని, ఎల్పీ సర్కిల్ అన్నా క్యాంటీన్ పక్కన గల సచివాలయం నందు గాని, లక్ష్మీ నగర్ సచివాలయం నందు గాని, పార్థసారధి నగర్-2 సచివాలయము నందు లేదా ఆన్లైన్ నందు పనులను చెల్లించవచ్చునని వారు తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లించి నపుడే పట్టణం అభివృద్ధికి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.
పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించండి..
RELATED ARTICLES