లిమా: అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం కావడంతో పెరూ ప్రధాని గుస్తావో అడ్రియాజెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పదవి నుంచి తప్పించడం కోసం మూడు తీర్మానాలపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా విధిధర్మానికి కట్టుబడి మంత్రిమండలి అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్లు వెల్లడిరచారు. టీవీ మాధ్యమంగా గుస్తావో తన రాజీనామాను ప్రకటించారు.