Monday, March 3, 2025
Homeపేదల ఇళ్ల కోసంకదం తొక్కిన ఎర్రదండు

పేదల ఇళ్ల కోసంకదం తొక్కిన ఎర్రదండు

. పుట్టపర్తిలో భారీ ర్యాలీ
. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన
. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం: ప్రభుత్వానికి రామకృష్ణ హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో – శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ అధ్వర్యంలో సోమవారం శ్రీ సత్యసాయి జిలా పుట్టపర్తిలో చిత్రావతి రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ వీధుల్లో ఎర్రజెండా రెపరెపలాడిరది. పేదల సమస్యలు పరిష్కరించాలని, వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ శ్రేణులు కదం తొక్కాయి. అనంతరం ధర్నాను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నిరుపేదలకు గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇంటి పట్టాలను మంజూరు చేయాలన్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణ పనులు పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వేమయ్య యాదవ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌ రెడ్డి… అరకొరగా ఒక సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, అది కూడా వాళ్ల పార్టీ కార్యకర్తకు మాత్రమే అందించారు తప్ప పేదలెవరికీ అందలేదని విమర్శించారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు గృహం నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, నిర్మాణానికి కావాల్సిన ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్‌, మహిళ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు పద్మావతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, మహదేవప్ప, కాటుమయ్య, బండలు వెంకటేశులు, చల్లా శ్రీనివాసులు, విద్యార్థి సంఘ నాయకులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు