Monday, April 14, 2025
Homeఅంతర్జాతీయంపొరుగు దేశాలతో వ్యూహాత్మక బంధం బలోపేతం

పొరుగు దేశాలతో వ్యూహాత్మక బంధం బలోపేతం

వాణిజ్య యుద్ధంలో విధానపరంగా ముందుకు: బీజింగ్‌ సదస్సులో జిన్‌పింగ్‌

బీజింగ్‌: పొరుగు దేశాలతో వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, అమెరికాతో వాణిజ్య యుద్ధం క్రమంలో విధానపరంగా ముందుకెళ్లాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సంకల్పించారు. ఈ ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పొరుగు దేశాలతో కలిసి పనిచేసే సమాజాన్ని నిర్మించాలని, ఇందుకోసం కొత్త వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సూచించారు. చైనా రాజధాని బీజింగ్‌లో మంగళ, బుధవారాలు జరిగిన సదస్సులో జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవాలని, తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని సంకల్పించారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సరఫరా గొలుసుల బంధాలను పెంచుకోవాలని, పొరుగు దేశాలతో సహకారాన్ని మెరుగు పర్చుకోవాలని నిర్ణయించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చైనాపై గురిపెట్టారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతులపై 104 శాతం సుంకాలు విధిస్తామంటూ ప్రకటించారు. ఈ క్రమంలో జిన్‌పింగ్‌ తొలిసారి బహిరంగంగా ప్రసంగించడానికి ప్రాధాన్యత ఏర్పడిరది. తమ దేశం వాణిజ్యపరంగా తీసుకోబోయే చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నవశకంలో ఇరుకు పొరుగు దేశాలతో పంచుకున్న అనుభవాలు, సాధించిన విజయాలను వివరించారు. శాస్త్రీయ కోణంతో ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేశారు.
తదుపరి పొరుగు దేశాలకు సంబంధించి తీసుకునే చర్యలు, పంచుకునే లక్ష్యాలు, ఆలోచనలపై చర్చించారు. ప్రధాని లీ కియాంగ్‌ అధ్యక్షత ఈ సదస్సు జరిగింది. కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ట్రంప్‌ తీరు మార్చుకోకుండా వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే తాము తుది వరకు పోరాడాలని చైనా సంకల్పించింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా జపాన్‌, దక్షిణ కొరియా తదితర పొరుగు దేశాలతో సంబంధాలు చక్కబెట్టుకోవడంపై ఐదేళ్లలో మొదటిసారిగా దక్షిణ కొరియా, జపాన్‌, చైనా మధ్య వాణిజ్యపరంగా చర్చలు జరిగాయి. మూడు దేశాల వాణిజ్య మంత్రులు భేటీ అయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ప్రాదేశికంగా, అంతర్జాతీయంగా ప్రోత్సహించడంపై చర్చించారు. దృష్టి పెట్టింది. గత నాలుగేళ్లుగా ప్రతిష్ఠంభనను ఎదుర్కొంటున్న భారత్‌`చైనా మధ్య సంబంధాల్లోనూ ఇటీవల పురోగతి కనిపించింది. సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌-చైనా ఏకం కావాలని ఇటీవల భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది. బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) కింద తమ పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలని చైనా యత్నిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు