Friday, February 21, 2025
Homeవ్యాపారంప్రపంచానికి చేరువ కావడమే లక్ష్యం: తెనాలి డబుల్‌ హార్స్‌

ప్రపంచానికి చేరువ కావడమే లక్ష్యం: తెనాలి డబుల్‌ హార్స్‌

హైదరాబాద్‌: మా ఉత్పత్తులను ప్రపంచానికి చేరువ చేయడమే లక్ష్యమని తెనాలి డబుల్‌ హార్స్‌ గ్రూప్‌ సీఎండీ మోహన్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక ఆహార, పానీయాల వాణిజ్య ప్రదర్శన గల్‌ఫుడ్‌ 2025లో పాల్గొంది. దుబాయిలో కొత్త కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో తెనాలి డబుల్‌ హార్స్‌ గ్రూప్‌ పేరుగాంచిందన్నారు. జనవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఇండస్‌ఫుడ్‌ 2025లో పాల్గొన్నామన్నారు. గల్‌ఫుడ్‌లో వరుసగా రెండో సారి పాల్గొనడం అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశించేందుకు ఒక మంచి అవకాశమన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు