Wednesday, April 23, 2025
Homeవిశ్లేషణప్రమాదంలో నగరాలు

ప్రమాదంలో నగరాలు

డా.జ్ఞాన్‌ పాఠక్‌

భారతదేశ నగరాలు, ప్రజలు, ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంలో ఉన్నాయని ఆసియా, పసిఫిక్‌ ప్రాంత యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ 81వ సమావేశం నివేదిక తెలియజేసింది. ఈ కమిషన్‌ సమావేశం ఇటీవల జరిగింది. ముఖ్యంగా నగరాలు నీటి సమస్యను ఎదుర్కోనున్నాయి. నీటి సమస్యేకాకుండా అనేక సంక్షోభాలను పరిష్కరించలేనంతగా ఎదుర్కోనున్నాయని కమిషన్‌ నివేదిక వెల్లడిరచింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో రాజకీయాలు ఎంతమాత్రం నగరాలను పరిరక్షించుకోలేని స్థాయికి చేరవచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రణాళిక, కార్యాచరణ మధ్య ఏమాత్రం సంబంధంలేకుండా ఉన్నది. పట్టణ, నగర ప్రాంతాలలో పెనుమార్పులు సంభవిస్తాయి.
దేశమంతటా అసాధారణమైన సంక్షోభం ఎర్పడే అవకాశంఉంది. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాలలో పట్టణప్రాంతాలు అభివృద్ధినుంచి విధ్వంసంవైపు వెళ్లనున్నాయి. భారతదేశంలోని అనేక ప్రాంతాలకు సంక్షోభం విస్తరిస్తుంది. అందువల్ల తక్షణం ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇండియా జీడీపీలో 70శాతం పట్టణాలనుంచే వస్తుంది. 2036 నాటికి 40శాతం ప్రాంతం పట్టణప్రాంతాలుగా పెరిగిపోతుంది. 2047నాటికి భారతదేశం అభివృది ్ధచెందిన దేశంగా మారాలంటే సుస్థిరమైన పట్టణీకరణ, అభివృద్ధి జరగాలి.
స్వీయరక్షణ దేశంగా పట్టణప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం చెబుతోంది. తీసుకునే చర్యలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధంలేకుండా ఉంది. ఈ అంశాన్ని 2020లోనే ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్‌ ధృవీకరించింది. ఉపగ్రహ చాయాచిత్రాలను ఆధారం చేసుకుని కమిషన్‌ సమావేశం నివేదిక రూపొందించి విడుదల చేసింది. పట్టణీకరణ పరిధిలో నగర కేంద్రాలలో చదరపు కిలోమీటర్‌కు 1500 మంది నివసిస్తున్నారు. వీరంతా శాశ్వతంగా నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నారు. ఒక్కొక్క పట్టణంలో కనీసం 50,000మంది జనాభా ఉంటున్నారు. పట్టణ, నగర శివారప్రాంతాలలో చదరపు కిలోమీటరుకు 300మంది నివసిస్తున్నారు. ఇది అత్యంత సాంద్రతగల ప్రాంతం అవుతోంది. భారతదేశంలో 2025 నాటికే పట్టణప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో జనాభా15.5శాతం మాత్రమే నివసిస్తున్నారు. పట్టణాలు, శివారు ప్రాంతాలలో 44.8శాతం నివసిస్తున్నారు. నగరాలు, శివారు ప్రాంతాలలో 39.8శాతం నివసిస్తున్నారు. ప్రభుత్వాలు స్వయంగా అందచేసే సమాచారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి అందచేస్తున్న ఈ సమాచారానికి ఏ మాత్రం పొంతనలేదు. 2011 జనాభా గణన చూసినట్లయితే పట్టణప్రాంతాలలో 31.8శాతం మాత్రమే ఉన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంత పట్టణ, నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు గరిష్టంగా అంటే 2051నాటికి 5.2బిలియన్లమంది ఉంటారు. భారతదేశం ఇప్పటికే అత్యధిక జనాభా`1.42 బిలియన్ల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో జనాభా తీవ్ర పరిస్థితులనే ఎదుర్కొనే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికగా చూసినప్పుడు దిల్లీ అతిపెద్ద నగరాలలో రెండవస్థానంలో ఉంది. జనాభా ఎక్కువగాఉన్న 10 నగరాలలో ముంబై 9వస్థానంలో ఉన్నది. ఈ కమిషన్‌ విడుదల చేసిన నివేదికలో 5 విధానపరమైన సిఫారసులున్నాయి. విధ్వంసాన్ని చక్కదిద్దడానికి సుస్థిర పట్టణ అభివృద్ధికి ప్రాంతీయ సహకారం పెంపొందాలి. బహుళస్థాయిలో సమగ్ర జాతీయ పట్టణ విధానాలను మెరుగుపరచాలి. నిర్ధారణ ఆధారంగా పట్టణప్రాంత విధానాలను అభివృద్ధిపరచాలి. విస్తీర్ణానికి సంబంధించిన ప్రణాళిక సమగ్ర సామాజిక విధానాలను పటిష్టపరచాలి. పట్ణణప్రాంతాలలో నిధులకు సంబంధించి విభిన్నమైన నూతన విధానాలను అనుసరించాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు