Thursday, April 3, 2025
Homeఅంతర్జాతీయంప్రాణాల కన్నా లాభాలు ముఖ్యమా?

ప్రాణాల కన్నా లాభాలు ముఖ్యమా?

బొగ్గు గనిలో ప్రమాదంపై కమ్యూనిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ స్పెయిన్‌ ఆగ్రహం

బెర్లిన్‌ : ఉత్తర స్పెయిన్‌లోని ఆస్టురియాస్‌ ప్రాంతంలోని డెగానా బొగ్గు గనిలో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై కమ్యూనిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ స్పెయిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు, మృతుల సహచరులు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు కార్మికులకూ మద్దతు తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందన్న దర్యాప్తు జరిగేంత వరకు ఆగడం సముచితమే అయినప్పటికీ ఐదుగురి ప్రాణాలు పోతే స్పందించకుండా మౌనంగా ఎలా ఉండగలమని బుధవారం ఓ ప్రకటనలో అసహనం వ్యక్తంచేసింది. కార్మికుల భద్రత కోసం యాజమాన్యాలు తీసుకునే చర్యలు తగ్గిపోతున్నాయని ఆవేదన చెందింది. మీకు లాభాలు ముఖ్యమా లేక కార్మికుల ప్రాణాలా అంటూ నిలదీసింది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినాగానీ కమ్యూనిస్టు పార్టీ ఆక్షేపిస్తూనే ఉంటుందని గుర్తుచేసింది.
సంవత్సరాలుగా కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యల కోసం డిమాండ్‌ చేస్తోందని తెలిపింది. ఇప్పటికైనా మైనర్ల ప్రాణాలకు భద్రత కల్పించేలా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని కమ్యూనిస్టు పార్టీ నొక్కిచెప్పింది. టెక్నికల్‌ స్టాఫ్‌ను తగ్గించడం, మైనింగ్‌ పరిస్థితులను, సదుపాయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని పేర్కొంది. పని పరిస్థితులను మెరుగుపర్చాలని డిమాండ్‌ చేసింది. ‘మేము పనికి వస్తున్నది కడుపు నింపుకోవడం కోసమే తప్ప ప్రాణాలు కోల్పోవడానికి కాదు’ అంటూ కార్మికుల తరపున నినాదమిచ్చింది. సమ్మెలు, తీర్మానాలు చేస్తే సరిపోదు… శ్రామిక వర్గానికి సముచిత భద్రత కోసం తక్షణ చర్యలకు హామీనిచ్చేలా పోరాడాలని కమ్యూనిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ స్పెయిన్‌ పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు