Tuesday, March 4, 2025
Homeఫైనల్‌కు భారత్‌

ఫైనల్‌కు భారత్‌

చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో ఆసీస్‌పై ఘన విజయం

రాణించిన కోహ్లీ, చివర్లో హార్దిక్‌ , రాహుల్‌ మెరుపులు

దుబాయ్‌ : ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే క్రికెట్‌లో టీమిండియా అప్రతిహత విజయపరంపరను కొనసాగిస్తోంది. ట్రోఫీ గెలుచుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి… ఫైనల్స్‌లో ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమికి కంగారూలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. విరాట్‌ కోహ్లీ (84, 98 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (45, 62 బంతుల్లో 3 ఫోర్లు) మరోసారి మంచి ప్రదర్శన చేశాడు. కేఎల్‌ రాహుల్‌ (42), హార్దిక్‌ పాండ్య (28) తమ వంతు సహకరించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (28Ñ 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (27Ñ 30 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. శుభ్‌మన్‌ గిల్‌ (8) నిరాశపర్చాడు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 2, బెన్‌ డ్వార్షుయిస్‌, నాథన్‌ ఎల్లిస్‌, కూపర్‌ కనోలీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మార్చి 9న ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌లో జరగనుంది. బుధవారం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య జరిగే సెమీ ఫైనల్‌-2లో విజేతగా నిలిచిన జట్టు తుది పోరులో భారత్‌తో తలపడనుంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (73Ñ 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అలెక్స్‌ కేరీ (61Ñ 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలు
సాధించారు. ప్రమాదకర ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (39Ñ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్నస్‌ లబుషేన్‌ (29), బెన్‌ డ్వార్షుయిస్‌ (19), జోష్‌ ఇంగ్లిస్‌ (11), నాథన్‌ ఎల్లిస్‌ (10), మ్యాక్స్‌వెల్‌ (7) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ 3, రవీంద్ర జడేజా 2, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్య ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు