Thursday, February 20, 2025
Homeవ్యాపారంఫోన్‌పేలో డివైజ్‌ టోకెనైజేషన్‌: కార్డ్‌ లావాదేవీలు సురక్షితం

ఫోన్‌పేలో డివైజ్‌ టోకెనైజేషన్‌: కార్డ్‌ లావాదేవీలు సురక్షితం

ముంబయి: క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ లావాదేవీలను మరింత సురక్షితంగా చేసే లక్ష్యంతో డివైజ్‌ టోకెనైజేషన్‌ సొల్యూషన్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే ప్రకటించింది. ఈ సౌకర్యంతో యూజర్లు ఫోన్‌పే యాప్‌లో తమ కార్డ్‌లను టోకెనైజ్‌ చేసుకోవచ్చు, అలాగే ఫోన్‌పేలో బిల్లు పేమెంట్లు, రీఛార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్‌, ఇన్సూరెన్స్‌ కొనుగోళ్లు, పిన్‌కోడ్‌లో పేమెంట్లు చేయడం వంటి అన్ని వినియోగ సౌకర్యాలతో పాటు ఫోన్‌పే పేమెంట్‌ గేట్‌వే సర్వీస్‌లు అనుసంధానించిన ఆన్‌లైన్‌ మర్చంట్ల వద్ద కూడా కార్డ్‌ టోకెన్‌లను సజావుగా ఉపయోగించుకోగలరు. వినియోగదారులకు, వారి కార్డ్‌లను టోకెనైజ్‌ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వారు ఇకపై తమ కార్డ్‌ వివరాలను మర్చంట్‌ ప్లాట్‌ఫామ్‌లలో సేవ్‌ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రతి లావాదేవీకి సీవీవీని ఎంటర్‌ చేయాల్సిన పని ఉండదు, దీని వల్ల విజయవంతమైన పేమెంట్ల రేటు అధికమవుతుంది, అలాగే చెక్‌అవుట్‌ వద్ద ఆగిపోయే పేమెంట్లు కూడా తగ్గుతాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు