Thursday, February 20, 2025
Homeఅంతర్జాతీయంబంగారు గనిలో ప్రమాదం

బంగారు గనిలో ప్రమాదం

48మంది దుర్మరణం

బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం సంభవించింది. కెనీబా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని కూలి 48 మంది కార్మికులు దుర్మరణం చెందగా…అనేక మంది గాయాల పాలయ్యారు. డాబియా కమ్యూన్‌లోని బిలాలీ టోకో వద్ద ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడిరచింది. చైనాకు చెందిన వారు ఈ బంగారు గని నడుపుతున్నారని… మట్టిపెళ్లలు విరిగిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటైన మాలి… ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిదారుల్లో అగ్రగామిగా ఉంది. బంగారంతోపాటు ఇక్కడ ఇనుప ఖనిజం, మాంగనీస్‌, లిథియం, యురేనియం వంటి సహజ వనరులు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్రాంతం చైనీస్‌ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు