విశాలాంధ్ర/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత విలువైన 2-వీలర్, 3-వీలర్ కంపెనీ అయిన బజాజ్ ఆటో లిమిటెడ్‌కు తమ గోగో వాహన విడుదలకు అత్యంత అనువైన నేపథ్యాన్ని హైదరాబాద్ అందించింది. దేశంలో అత్యంత కీలకమైన నగరంలో పట్టణ చలనశీలత భవిష్యత్తును పరిచయం చేసింది. ‘గోగో’ పేరు డ్రైవర్లు తమ మూడు చక్రాల చక్ర వాహనాలతో ఉన్న ప్రేమపూర్వక అనుబంధం, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు మూడు చక్రాల వాహనాలను ఎలా పిలుస్తారో అనే అంశం నుండి ఇది ప్రేరణ పొందింది. వీటిని హైదరాబాద్‌లోని ఒక హోటల్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రవాణా , బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బజాజ్ ఆటో లిమిటెడ్ ఇంట్రాసిటీ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సమర్దీప్ సుబంధ్, వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె వి బాబుల్ రెడ్డి విడుదల చేశారు. ప్యాసింజర్ వాహనాలు పీ5009 మోడల్ రూ.3,26,797కు, పీ7012, రూ.3,83,004కు లభిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా అన్ని బజాజ్ ఆటో డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.