హైదరాబాద్: ప్రముఖ పెట్టుబడిదారుడు, వ్యాపారవేత్త, బాస్ వాలా అధినేత శశి రెడ్డి ఆధ్వర్యంలోకి ‘ఫ్రీడం’ యాప్ వచ్చింది. ఈ యాప్ ఒక ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్. ఇది సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచేది. ఇందులో బాస్ వాలా ఏడు మిలియన్ డాలర్లు (సుమారు 60 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా బాస్ వాలా వ్యవస్థాపకుడు, సీఈఓ శశిరెడ్డి మాట్లాడుతూ ఈ ఫ్రీడం యాప్ ద్వారా లభించే ఉపాధి ఆధార విద్యా కంటెంట్‌తో పాటు బాస్ వాలా వివిధ వ్యాపార రంగాల్లో వేల మంది నిపుణులను అందుబాటులోకి తెస్తుందన్నారు. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వ్యక్తులకు అవసరమైన వనరులు అందించనుందన్నారు.