Wednesday, May 28, 2025
Homeవ్యాపారంబిస్సెల్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌

బిస్సెల్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌

న్యూదిల్లీ : గృహోపకరణాల విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్‌ బిస్సెల్‌ వెట్‌ క్లీనింగ్‌ సొల్యూషన్స్‌లోనూ విశ్వసనీయమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన బిస్సెల్‌ బ్రాండ్‌ ఇప్పుడు భారతదేశంలో తన ఉనికిని మరింతగా చాటుకునేందుకు బాలీవుడ్‌ ఐకాన్‌ కరీనా కపూర్‌ ని తన ఇండియన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. 145 సంవత్సరాల ప్రపంచ ప్రఖ్యాతి వారసత్వ బ్రాండ్‌తో భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ప్రముఖులలో ఒకరిని ఒకచోట చేర్చింది బిస్సెల్‌. ఈ సందర్భంగా బిస్సెల్‌ హోమ్‌ కేర్‌ ఇంక్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ అధ్యక్షుడు మ్యాక్స్‌ బిస్సెల్‌ మాట్లాడుతూ, కరీనా కపూర్‌ ఆధునిక సగటు భారతీయ గృహిణికి ప్రతిరూపమని, ఆలోచన, ముందుచూపు, ఆరోగ్యకరమైన గృహ వాతావరణాన్ని సృష్టించడానికి లోతైన నిబద్ధతను కలిగి ఉందన్నారు. నాణ్యత పట్ల ఆమెకున్న నిబద్ధత బిస్సెల్‌ దృష్టితో సజావుగా సరిపోతాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు