Thursday, April 3, 2025
Homeబీసీలకు మోదీ అన్యాయం

బీసీలకు మోదీ అన్యాయం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బీసీలకు మోదీ అన్యాయం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. తాను బీసీ అని చెప్పుకుంటున్న మోదీ … బీసీలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని నిలదీశారు. దిల్లీలో బుధవారం జంతర్‌ మంతర్‌ వేదికగా జరిగిన బీసీ గర్జనలో నారాయణ మాట్లాడుతూ… బీసీల కోసం కొట్లాడిన కృష్ణయ్య బీజేపీ ఒడిలో చేరిపోయాడని విమర్శించారు. పనికిమాలిన రాజ్యసభ పదవి కోసం అమ్ముడుపోతాడా… అటువంటి నాయకుడు బీసీలకు న్యాయం చేస్తాడా..ఆయనను ఎవరు గుర్తిస్తారు… అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు ఎంత ఇస్తారు అనేది కాదు పరిపాలనలో భాగస్వామ్యం, రాజకీయ హక్కులు కావాలని అన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్‌ అర శాతం, ఒక్క శాతం ఉన్న వాళ్లకు కూడా న్యాయం జరగాలని పేర్కొన్న విషయాన్ని నారాయణ గుర్తు చేశారు. కాంగ్రెస్‌, వామపక్షాలు బీసీ రిజర్వేషన్‌ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమానికి, బీసీ రిజర్వేషన్‌ సాధించే విషయంలో కమ్యూనిస్టు పార్టీ బీసీలకు అండగా నిలబడుతుందని నారాయణ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు