విశాలాంధ్ర ధర్మవరం : అనంతపురం జిల్లా రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉజ్జినప్ప (50 సంవత్సరాలు) వ్యవసాయానికి బ్యాంకుల వద్ద రుణం తీసుకొని పంటలు సరిగా పండక, ఆ రుణం ఎలా తీర్చాలో తెలియక ధర్మవరం మండలం కందుకూరు గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. కానీ వ్యవసాయం చేస్తూ పంటలు సరిగా పండక పోవడం బ్యాంకుకు చెల్లించాల్సిన ఋణమును ఎలా కట్టాలి? అంటూ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని ధర్మవరం జి అర్ పి రైల్వే పోలీసులు తెలిపారు. మృతులకు ఇద్దరు కుమారులు భార్య అరుణ ఉన్నారు. రైల్వే పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
బ్యాంకు రుణం తీర్చలేక రైతు రైలు కిందపడి ఆత్మహత్య
RELATED ARTICLES