వాషింగ్టన్: ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటే కలిసి భోజనం చేయాలని, కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని భారత్, పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు మరోమారు సూచించారు. తన వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని, అణు యుద్ధాన్ని నివారించానని చెప్పుకున్న ట్రంప్… భారత్`పాక్ కలిసి భోజనం చేస్తే బాగుంటుందని అన్నారు. సౌదీ పర్యటనలో భాగంగా తనను తాను శాంతి దూతగా ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి పాల్గొన్నారు. తన మధ్యవర్తిత్వం లక్షలాది ప్రాణాలను కాపాడిరదని, భారత్, పాక్ మధ్య శాంతికి దోహదమైందన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మార్కో రూబియో పాత్రను కొనియాడారు. భారత్, పాక్ మధ్య పరిస్థితులు సర్దుకుంటే… ఓ మంచి విందు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్, పాక్ మధ్య కాల్పుల వివరణ కోసం తన మధ్యవర్తిత్వం బాగా పనిచేసిందని, చర్చల్లో వాణిజ్య అంశాలను ఎక్కువగా వాడానని ట్రంప్ మరోసారి వెల్లడిరచారు. ‘సహచరులారా రండి..ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాం..కొంత వ్యాపారం చేద్దాం’ అని భారత్, పాక్‌కు చెప్పినట్లు తెలిపారు. ‘అణు క్షిపణుల వాణిజ్యం చేయొద్దు. అందరికీ ఆనందం కలిగేలా చేద్దాం’ అని సూచించినట్లు వెల్లడిరచారు.
భారత్, పాకిస్థాన్ అధినేతలు శక్తిమంతులు, తెలివైన నాయకులని, వారి మధ్య అంతా సర్దుకుందని, ఇక శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆకాంక్షించారు. ఇదిలావుంటే, భారత్, పాకిస్థాన్‌కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) చర్చలు జరిపిన క్రమంలో కుదిరిన ఏకాభిప్రాయంతో కాల్పుల వివరణ జరిగిందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని భారత్ స్పష్టంచేసింది.
భారత్`పాక్ కలిస్తే బాగుంటుంది: ట్రంప్
RELATED ARTICLES