Wednesday, March 5, 2025
Homeఅంతర్జాతీయంభారత్‌, చైనాపై ప్రతీకార సుంకాలు

భారత్‌, చైనాపై ప్రతీకార సుంకాలు

ఏప్రిల్‌ 2 నుంచి అమలు – అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్‌

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దూకుడు కొనసాగిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా దేశాలపై సుంకాలను ప్రకటిస్తున్నారు. తాజాగా భారత్‌పైనా సుంకాలు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి భారత్‌, చైనా మీద ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్‌ వెల్లడిరచారు. భారత్‌, ఇతర దేశాలు అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయని, ఇది చాలా అన్యాయమని అన్నారు. అమెరికా వస్తువులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయబోతున్నట్లు అమెరికా కాంగ్రెస్‌ ఉమ్మడి సమావేశంలో ట్రంప్‌ ప్రకటించారు. ‘మీరు మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే టారిఫ్‌లు తప్పవు. కొన్ని సందర్భాల్లో ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది’ అని అన్నారు. దశాబ్దాలుగా అమెరికాపై ఇతర దేశాలు సుంకాలు విధిస్తున్నాయని, ఇక తమ వంతు వచ్చిందన్నారు. యూరోపియన్‌ యూనియన్‌, చైనా, బ్రెజిల్‌, భారత్‌ వంటి చాలా దేశాలు భారీ సుంకాలు విధిస్తున్నాయని, ఇది చాలా అన్యాయమని ఆయనన్నారు. భారత్‌ 100శాతానికి పైగా ఆటో టారిఫ్‌లు విధించిందని తెలిపారు. అమెరికా విధించే దాని కంటే చైనా రెట్టింపు వసూలు చేస్తోందని, దక్షిణ కొరియా ఏకంగా నాలుగు రెట్లు అధికంగా టారిఫ్‌ అమలు చేస్తోందన్నారు. దక్షిణ కొరియాకు సైనికపరంగానే కాకుండా ఇతర విధాలా సహాయ సహకారాలను అమెరికా అందిస్తున్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని చెప్పారు. ‘భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశం దశాబ్దాలుగా మనల్ని పిండేస్తోంది. ఇక అలా జరగనివ్వం. ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తాం. మిగతా దేశాలు మనపై ఏ మేరకు సుంకాలు విధిస్తే… అంతేస్థాయిలో వారి నుంచి మనం వసూలు చేద్దాం’ అని రిపబ్లికన్‌ సభ్యుల హర్షధ్వనుల మధ్య ట్రంప్‌ ఉద్ఘాటించారు. ‘వారు మనల్ని వారి మార్కెట్‌లోకి రానివ్వరు… మనం ట్రిలియన్లు… ట్రిలియన్ల డాలర్లు తీసుకుందాం. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాలు సృష్టించుకుందాం’ అని ఆయనన్నారు. ప్రతీకార సుంకాలు ద్వారా అమెరికా సుసంపన్నం కాగలదని ట్రంప్‌ ఆకాంక్షించారు.
ఎలాగైనా గ్రీన్‌ల్యాండ్‌ను చేజిక్కించుకుంటాం…
గ్రీన్‌ల్యాండ్‌ను ఏదో ఒక విధంగా చేజిక్కించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ట్రంప్‌ వెల్లడిరచారు. గ్రీన్‌ల్యాండ్‌ అమెరికా వశమైతే ఆ ద్వీప ప్రజలను సంపన్నులుగా మారుస్తామని చెప్పారు. ‘మీకు రక్షణ ఇస్తాం. ధనవంతులుగా మారుస్తాం. ఐక్యతకు హామీనిస్తాం. గ్రీన్‌ల్యాండ్‌ ఊహించని రీతిలో పురోగతి సాధించేలా చేస్తాం’ అని గ్రీన్‌ల్యాండ్‌ ప్రజలనుద్దేశించి ట్రంప్‌ అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ జనభా తక్కువ… భూమి ఎక్కువని, ఇది సైనిక భద్రతకు కీలకమన్నారు. అంతర్జాతీయ ప్రపంచ భద్రతకు గ్రీన్‌ల్యాండ్‌ మనకు కావాలని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘మీరు ఒప్పుకుంటే అమెరికాలోకి స్వాగతిస్తాం. మీ భవిష్యత్‌ ఆకాంక్షలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని ట్రంప్‌ అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా సొంతం చేసుకుంటామని, ఇందుకోసం అన్ని విధాలా యత్నిస్తున్నామని చెప్పారు. ట్రంప్‌ ప్రతిపాదనకు గ్రీన్‌ల్యాండ్‌ ప్రజలు వ్యతిరేకమని ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది.
అమెరికా ఈజ్‌ బ్యాక్‌…
దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా అధ్యక్ష ఎన్నికలు జరిగాయని తన విజయాన్ని ఉద్దేశించి ట్రంప్‌ అన్నారు. ‘అమెరికా ఈస్‌ బ్యాక్‌’ అని నినాదమిచ్చారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తిరిగొచ్చిందన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేసినట్లు వెల్లడిరచారు. మరో 400 కార్యనిర్వాహక చర్యలు కూడా చేపట్టానని ట్రంప్‌ చెప్పారు. డోజ్‌ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను, తన భార్య మెలేనియాను ట్రంప్‌ మెచ్చుకున్నారు. గొప్ప ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డోజ్‌ కోసం మస్క్‌ చాలా కష్టపడుతున్నారని అన్నారు. ఆన్‌లైన్‌లో అశ్లీలతను అడ్డుకునేలా బిల్లు తేవడంతో చాలా కృషి చేశారంటూ మెలేనియాను మెచ్చుకున్నారు. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించినందుకు ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. దీంతో రిపబ్లికన్‌ సభ్యులంతా తమ స్థానాల్లో నుంచి లేచి నిలబడి చప్పట్లతో మస్క్‌, మెలేనియాను అభినందించారు.
శాంతికి రష్యా… చర్చలకు ఉక్రెయిన్‌ సిద్ధం
శాంతికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు బలమైన సంకేతాలు అందాయని ట్రంప్‌ అన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి ఓ లేఖ అందిందని, దాని ప్రకారం వారు చర్చలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఖనిజాలుభద్రతా ఒప్పందంపై సంతకాలకూ ఉక్రెయిన్‌ సిద్ధమేనని ట్రంప్‌ చెప్పారు. ‘ఉక్రెయిన్‌రష్యా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నా. ఈ యుద్ధంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది’ అని అన్నారు. ‘ఉక్రెయిన్‌ ప్రజల కంటే ఎక్కువగా శాంతిని కోరుకునే వారు ఉండరు… శాంతి చర్చలకు సిద్ధమంటూ’ జెలెన్‌స్కీ నుంచి తనకు లేఖ అందిందని ట్రంప్‌ చెప్పారు. అమెరికా చేసిన సహాయానికి రుణపడి ఉంటామని కూడా జెలెన్‌స్కీ పేర్కొన్నారన్నారు. ఖనిజాలు`భద్రతా ఒప్పందంపై ఎప్పుడైనా సంకతం చేసేందుకు ఉక్రెయిన్‌ సిద్ధమని ట్రంప్‌ చెప్పారు. అటు రష్యాతోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. రష్యా కూడా శాంతికి కట్టుబడి ఉందన్నారు. ‘మారణహోమం ఆగితే బాగుంటుందని… అర్థంలేని ఈ యుద్ధంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. యుద్ధాలు ఆపాలంటే రెండు వర్గాలతో సంప్రదింపులు జరపాలి’ అని ట్రంప్‌ అన్నారు.
డెమొక్రాట్ల వాకౌట్‌…
ట్రంప్‌ ప్రసంగాన్ని డెమొక్రాట్లు అడ్డుకున్నారు. ‘నో కింగ్‌’ (మీరేమి రాజు కాదు), ‘సేవ్‌ మెడిక్‌ ఎయిడ్‌’ (వైద్య సహాయాన్ని పరిరక్షించాలి) వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రంప్‌ ప్రసంగిస్తున్న సమయంలో రిపబ్లికన్లకు డెమొక్రాట్లు వీపు చూపారు. ట్రంప్‌ అభిశంసన కోసం ప్రతిపాదించాలనుకున్న డెమొక్రాట్‌, అల్‌ గ్రీన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ప్రతినిధి… సభను అడ్డుకున్నారు.
ట్రంప్‌ ప్రసంగించడం మొదలు పెట్టినప్పుడు బిగ్గరగా అరిచారు. దీంతో స్పీకర్‌ మైక్‌ జాన్స్‌న్‌ ఆయనను సభ నుంచి బయటకు పంపాలని ఆదేశాలివ్వగా రిపబ్లికన్లు హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రశంసం మొదలు పెట్టినప్పుడు డెమొక్రాట్లు చాలా మంది వాకౌట్‌ చేశారు. వారి ఆందోళనలను ట్రంప్‌ తోసిపుచ్చారు. ‘నా ముందరున్న డెమొక్రాట్లను సంతోషపెట్టేందుకు నేను చేయగలిగినది ఏమీ లేదు. ఇక్కడ కూర్చున్న వారెవ్వరూ చప్పట్లు కొట్టరు. లేని నిలబడరు. గొప్ప విజయాలను మెచ్చుకోరు’ అని డెమొక్రాట్లనుద్దేశించి ట్రంప్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు