Friday, May 16, 2025
Homeఅంతర్జాతీయంభారత్‌ దెబ్బకు సెలెబీ షేర్ల పతనం

భారత్‌ దెబ్బకు సెలెబీ షేర్ల పతనం

ఇస్తాంబుల్‌: భారత్‌ దెబ్బకు టర్కీకి చెందిన సెలెబీ కంపెనీ షేరు ధర ఏకంగా 10 శాతం పతనమైంది. గత నాలుగు సెషన్లలో ఈ షేరు విలువ 30శాతం ఆవిరైంది. సెలెబీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారతీయ విమానాశ్రయాలలో సరకుల రవాణాతోపాటు బహుళ సేవలను అందించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ మద్దతుతో సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్‌లను భారత్‌ రద్దు చేసింది. అదానీ ఎయిర్‌ పోర్టు సంస్థ కూడా సెలెబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. దీంతో ముంబై, అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుల నుంచి ఆ కంపెనీ బయటకు వెళ్లినట్లైంది. ప్రస్తుతం అదానీ ఎయిర్‌ పోర్ట్స్‌ హోల్డింగ్‌ ముంబై, అహ్మదాబాద్‌, మంగళూరు, గువహాటి, జైపుర్‌, లక్నో, తిరువనంతపురం విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు లిమిటెడ్‌ కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. ఆ స్థానంలో ఏఐఎస్‌ఏటీఎస్‌, బర్డ్‌గ్రూప్‌తో కలిసి పని చేయనున్నట్లు తెలిపింది. దీంతో తమది టర్కీ కంపెనీ కాదని సెలెబీ వివరణ ఇచ్చింది. ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్‌ కుటుంబంతో తమకు సంబంధం లేదని, ఆయన కుమార్తె తమకు బాస్‌ కాదని వెల్లడిరచింది. ‘‘ఎర్డోగాన్‌ కుమార్తె సుమెయ్యి మా కంపెనీని నియంత్రిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదు. మా మాతృసంస్థలో ఆ పేరుతో ఎవరికీ హక్కులు గానీ, వాటాలు గానీ లేవు. అసలు మాది టర్కీ సంస్థే కాదు. మా కంపెనీ యాజమాన్య హక్కులన్నీ సెలెబీయోగ్లు కుటుంబానికే పరిమితం. వారికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు’ అని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు