Friday, May 16, 2025
Homeతెలంగాణ‘భూ భారతి’ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తాం

‘భూ భారతి’ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తాం

. పట్టాదారు పాసుపుస్తకంలో భూకమతాల మ్యాపులు ముద్రిస్తాం
. అర్హులైన రైతులకు పట్టాలిస్తాం
. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

విశాలాంధ్ర -హైదరాబాద్‌ : భూ భారతి చట్టం అమలులో భాగంగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం జరిగిన భూభారతి అవగాహన సదస్సుల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. భూభారతి నాలుగు పైలట్‌ మండలాల్లో 13 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఈనెల 30లోగా పరిష్కరిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తహసీల్దార్‌, ఆర్డీఓ, అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌, సీసీఎల్‌ఏ, ఆపై ట్రిబ్యునల్‌ స్థాయిలో అప్పీల్‌ వ్యవస్థను భూభారతి చట్ట ప్రకారం రూపొందించామన్నారు. రెవెన్యూశాఖ సేవలు సులభంగా, పారదర్శకంగా ప్రజలకు అందించేలా కార్యాచరణ అమలవుతున్నట్లు తెలిపారు. భూభారతి కార్యక్రమం ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం వేగవంతం కావడమే కాకుండా, రైతులకు నమ్మకమైన భూ సమాచారం అందుతోందని చెప్పారు. వాస్తవిక డేటాతో భూ పత్రాలు సమర్పిం చడం వల్ల భవిష్యత్తులో హక్కులపై ఆందోళన ఉండదన్నారు. భూ సమస్యలను ఉద్దేశపూర్వకంగా పరిష్కరించని అధికారులను ఉపేక్షించ బోమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. భూ యజమానుల భూ కమతాలకు మ్యాపులను పట్టాదారు పాసుపుస్తకంలో ముద్రిస్తామన్నారు. ఆరువేల మంది లైసెన్సు కలిగి ఉన్న సర్వేయర్లను నియమిస్తున్నామని చెప్పారు. దీంతో భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు. త్వరలో గ్రామ రెవెన్యూ అధికారులనూ నియమిస్తామని చెప్పారు. పట్టాలేని భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన పోడు భూముల రైతులకు పట్టాలు ఇస్తామని పొంగులేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని, గత ప్రభుత్వ తొందరపాటు చర్యతో రైతులు శిక్షను అనుభవించారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మొదటి విడతగా ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించా మని, మరో నాలుగు విడతల్లో ఇళ్లు అందజేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు