Homeక్రీడలుమనం ఐసీసీ ట్రోఫీలుదొంగతనం చేయాల్సిందేనా?

మనం ఐసీసీ ట్రోఫీలుదొంగతనం చేయాల్సిందేనా?

- Advertisement -

పాక్ వరుస ఓటములపై మాజీ క్రికెటర్ కమ్రాన్ ఫైర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ పతనం అవుతోంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైన పాక్, తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దీంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సిరీస్ ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సొంత జట్టుపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్ పూర్తిగా పతనం అవుతుందని, ఇది ఇలాగే కొనసాగితే నెదర్లాండ్స్‌పైనా ఓటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని విమర్శించాడు. కనీసం ద్వైపాక్షిక సిరీస్‌లు నెగ్గకపోతే ఐసీసీ ట్రోఫీలు ఎలా గెలిచేదంటూ మండిపడ్డాడు. ‘ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఎలాంటి ప్రయోగాలు చేశారు? అది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. అలాంటిది టాస్ నెగ్గితే బ్యాటింగ్ కాకుండా, బౌలింగ్ ఎందుకు తీసుకున్నారు? నిజానికి బంగ్లా 350G స్కోర్ చేయాల్సింది. కానీ చివర్లో లిట్టన్ దాస్ నెమ్మదిగా ఆడడం వల్ల 290 వద్దే ఆగిపోయింది. ఇది సిరీస్‌ను డిసైడ్ చేసే మ్యాచ్. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనే విజయం సాధించలేనప్పుడు, ఐసీసీ ఈవెంట్ల కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు. కొంపదీసి ఐసీసీ ట్రోఫీని దొంగిలించాలని ప్లాన్స్ చేస్తున్నారా?’ అని అక్మల్ అన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు