Friday, June 6, 2025
Homeఅంతర్జాతీయంమనది నిజమైన స్నేహ బంధంబెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌తో జిన్‌పింగ్‌

మనది నిజమైన స్నేహ బంధంబెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌తో జిన్‌పింగ్‌

బీజింగ్‌ : బెలారస్‌`చైనా స్నేహం, సహకార బంధం మరింత బలోపేతం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. ఆయన బుధవారం బీజింగ్‌లో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకోతో భేటీ అయ్యారు. తిరిగి ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బెలారస్‌, చైనా నిజమైన మిత్రదేశాలని, మంచి భాగస్వామ్య దేశాలని, పరస్పరం నమ్మకం, నిబద్ధతతో కలిసి ముందుకు వెళుతున్నాయని జిన్‌పింగ్‌ అన్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకుంటుడటంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక ఫలితాల దృష్ట్యా తమ బంధం మరింత పటిష్ఠం కావాలన్నారు. ద్వైపాక్షిక సంబంధాల సుస్థిరాభివృద్ధిని పెంపొందించడం, రెండు దేశాలకు ప్రయోజనంగా పరిణమించే సహకారాన్ని పెంచుకోవడానికి బెలారస్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్‌ చెప్పారు. అలెగ్జాండర్‌ 15వ సారి చైనాలో పర్యటించారు. తాను చైనా ఎప్పుడు వచ్చినా తమ స్నేహం మరింత బలోపేతం అవుతున్నట్లు తెలిపారు. తమ దేశానికి చైనా సహకారాన్ని అభినందించారు. చైనాతో మరింత సహకారానికి సిద్ధమన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు