Friday, December 27, 2024
Homeమన్మోహన్‌ ఇకలేరు

మన్మోహన్‌ ఇకలేరు

న్యూదిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ ఇక లేరు. నవ భారత రూపశిల్పి 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో ఆయన్ని కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మన్మోహన్‌ సింగ్‌ మృతికి ప్రధాని మోదీతో సహా రాజకీయ ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌.. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ పని చేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్ద కాలంపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సింగ్‌… మే 26, 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు ఆ పదవిలో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 3,656 రోజుల పాటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌(యూపీఏ) ప్రభుత్వానికి నాయకత్వం వహించి, అత్యధిక కాలం పనిచేసిన మూడో ప్రధానిగా నిలిచారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు