Thursday, March 6, 2025
Homeవిశ్లేషణమరో ఐదేళ్లు స్తంభించనున్న వృద్ధి

మరో ఐదేళ్లు స్తంభించనున్న వృద్ధి

డా॥ జ్ఞాన్‌పాఠక్‌
భారతదేశ వృద్ధి రేటు గత నాలుగేళ్లు దిగజారిపోవడమేకాక రానున్న ఐదేళ్లు స్తంభించిపోనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. 202425 నాటికి గడిచిన నాలుగేళ్లు వృద్ధి రేటు దిగజారింది. 2030 దాకా స్తంభించనున్నదని ఐఎంఎఫ్‌ అధ్యయనం తెలియజేసింది. రానున్న ఐదేళ్లు వృద్ధి రేటు 6.5 శాతమే ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వార్షిక వృద్ధి రేటు 7.8 శాతం ఉండాలని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఇండియా అధికంగా శ్రమించడంతో పాటు అభివృద్ధి విధానాల వైపు మళ్లాలి. జాతీయ గణాంకాల కార్యాలయం తాజా అంచనా ప్రకారం 202425 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ 6.2 శాతం ఉండగా 2024 జులైసెప్టెంబరు నాటికి జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గి పోయింది. 202425 పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతం ఉండగా, 2025 జనవరిలో విడుదల చేసిన రెండవసారి వేసిన అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి చేరింది. అయిన ప్పటికీ గడచిన నాలుగేళ్ల కాలంలో వృద్ధిరేటు అత్యంత తక్కువగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం వృద్ధిరేటు సాధించా లంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు తప్పని సరిగా 7.6 శాతం సాధించాలి. ఇది మనకు సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. పాలకులు మాత్రం గొప్పగొప్ప ప్రసంగాలు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి అపారంగా అప్పులు తెచ్చుకొని దేశాన్ని అప్పుల పాలు చేశారు.
ఇక్కడ ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. 202324లో జీడీపీ వృద్ధిరేటును 9.2 శాతంగా పునఃసమీక్షించారు. అంతక్రితం 8.2 శాతంగా పునఃసమీక్షించారు. ఇండియాలో గడచిన 12 ఏళ్లలో ఇదే రెండవ అతి పెద్ద అధిక వృద్ధిరేటు. 202122 లో దేశంలో వృద్ధిరేటు 9.7 శాతంగా నమోదైంది. ఇది అత్యంత తక్కువ తిరోగమన రేటుకు ప్రారంభం. ఇది () 7.3 శాతం. ప్రపంచ బ్యాంకు గత వారం విడుదల చేసిన నివేదికలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వార్షిక వృద్ధిరేటు తప్పనిసరిగా 7.8 శాతం వృద్ధి సాధిం చాలి అని తెలిపింది. ఇది జరగాలంటే అన్ని వృద్ధి రంగాలు కదలాలి. సంస్కరణలు వేగవంతం కావాలి. అన్ని రంగాల్లో అధిక ఆదాయం పొందే దేశంగా వృద్ధి చెందాలి. రానున్న రెండేళ్లు 202425, 202526ల్లో 6.5 శాతం తప్పనిసరిగా జీడీపీ వృద్ధి సాధించడానికి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ‘‘ఆర్థిక దృష్టి కిందకు దిగజారుతున్న రిస్క్‌లు కనిపిస్తున్నాయి’’ అని ఐఎంఎఫ్‌ తెలిపింది. వాస్తవ ఆదాయాలు తగినంత రాక, తక్కువగా ఉన్నట్లయితే, పెట్టు బడులు బలహీనంగా ఉన్నా, ప్రైవేటు రంగంలో రాబడి రాక విని మయం తగ్గితే వృద్ధి సాధించడం కష్టమవుతుంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లయితే వ్యవసాయ ఉత్పత్తులు కూడా ప్రతికూలంగా ఉంటాయి. ఆహారధాన్యాల ధరలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినిమయం తగ్గుతుంది. మార్కెట్లలో ఖర్చులు తగ్గుతాయి. వస్తువుల విక్రయాలు పడిపోతాయి. వృద్ధి వైపు సాగాలంటే, సంస్థాగత సంస్కరణలు వేగంగా అమలు జరిగితే, ప్రైవేటు పెట్టుబడులు పెరుగు తాయి, ఉద్యోగాలు అధికంగా లభిస్తాయి. వృద్ధికి అవకాశాలుంటాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఇండియా ఆర్థిక రంగ సౌష్టవం కార్పొరేట్‌ బాలెన్సు షీట్లను బలోపేతం చేసిందని, డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాల పునాది బలపడుతుంది. మధ్య తరహా రంగ వృద్ధికి అవకాశం ఉంటుంది, సామాజిక సంక్షేమ ప్రయోజనాలు ఉంటాయి. భారత్‌కు 2021202930 మధ్య ఐఎంఎఫ్‌ రూపొందించిన ప్రణాళిక ప్రకారం వేసిన అంచనా ఇలా ఉంది. వృద్ధిరేటు క్రమంగా 202122 మధ్యలో 9.7 శాతానికి దిగజారింది. 202223 నాటికి 7 శాతానికి పడిపోయింది. 202324 నాటికి 8.2 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వం ఇటీవల 9.2 శాతానికి సమీక్షించింది. అనంతరం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 202425 కు వృద్ధిరేటు 6.5 శాతానికి అంచనా వేసింది. 202930 వరకు భారత్‌ వృద్ధిరేటు 6.5 శాతమే ఉంటుందని ఐఎంఎఫ్‌ తెలిపింది.
గత సంవత్సరంగా పొదుపు, పెట్టుబడులకు సంబంధించి జీడీపీ శాతం పడిపోయిందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల పొదుపు 32.7 శాతంగా అంచనా వేసింది. అయితే ఇది 30.5 శాతానికి పడిపోవచ్చునని తెలిపింది. అలాగే స్థూల పెట్టుబడులు 33.6 శాతం నుంచి 32.6 శాతానికి ఇదే కాలం తగ్గిపోతుందని తెలిపింది. మరోవైపు ఈ గణాంకాలను బీజేపీ ప్రభు త్వం అంగీకరించింది. గత పదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ దాదాపు 140 లక్షల కోట్లు డాలర్లు అప్పు చేశారు. బడా పెట్టుబడి దారులు పన్ను రాయితీలను అపారంగా పొందినప్పటికీ సొంత నిధులను విరివిగా పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు పెంచడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా వృద్ధి చెందుతుందని ప్రచారం మాత్రం సాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు