Friday, February 21, 2025
Homeవిశ్లేషణమళ్లీ ఆధిపత్యానికి ట్రంప్‌ ఆట

మళ్లీ ఆధిపత్యానికి ట్రంప్‌ ఆట

డా. బాలచంద్ర కాంగో

బహుళజాతి కంపెనీలు, వాటి బలమైన మద్దతు దేశాలు ఇంగ్లాండ్‌, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెట్టుబడులుపెట్టి స్వేచ్ఛా వాణిజ్యంగా పిలిచే వాణిజ్యం ద్వారా తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటీఓ)ను అడ్డుపెట్టుకోవడమేగాక దానికి ఎల్‌పీజీ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) అని పిలిచారు. అమెరికాకు రొనాల్డ్‌ రీగన్‌ అధ్యక్షుడుగా ఉన్న నాటి నుంచి ఈ క్రమం ప్రారంభమైంది. మరొక ఆసక్తికరమైన అంశం, బిల్‌ క్లింటన్‌, బరక్‌ ఒబామా (డెమొక్రటిక్‌ అధ్యక్షులు) పాలనాకాలం వరకు ఈ విధానం అమలులో ఉంది. వీరిద్దరూ అమెరికా ఆధిపత్యంతో పాలించాలని కోరుకున్నారు. చైనా, రష్యా, ఇతర ఆసియా దేశాలు ఇండియా, జపాన్‌, దక్షిణ కొరియాలు వృద్ధిచెందిన తర్వాత అమెరికాను గురించి ఆలోచించడం ప్రారంభించాయి. తక్కిన దేశాలు పెరిగాయని ఫర్దీన్‌ జ కొరియా తన రచనల్లో పేర్కొన్నారు. అమెరికా అధిపత్య స్థానాన్ని ఈ దేశాలు సవాలుచేశాయి. ఇప్పుడు రిపబ్లికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానపరమైన ధోరణిని మార్చారు. వస్తువులు దిగుమతులు చేసుకుంటున్న దేశాల నుంచి ఏకపక్షంగా అధిక సుంకాలను వసూలు చేస్తున్నారు. 2016లో మొదటిసారి ట్రంప్‌ అధ్యక్షుడైనప్పుడు రష్యాను, చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. ‘నాటో’ ద్వారా ఐరోపా రష్యా మధ్య ఉద్రిక్తతలు పెంచడానికి ఐరోపాకు సహాయం చేశాడు.
చౌకగా ఉన్న ముడిచమురు, గ్యాస్‌ కోసం రష్యాపై ఐరోపా ఆధారపడిరది. రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది. అమెరికా వైపు ఐరోపా మళ్లింది. ఇప్పుడు అమెరికా, ఐరోపాకు భారీగా ఆయిల్‌, గ్యాస్‌, సరఫరా చేస్తోంది. ఆదే సమయంలో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఐరోపా దేశాలన్నీ కలిసి యూరోపియన్‌ పార్లమెంటుగా ఏర్పడిరది. ‘నాటో’ ద్వారా ఐరోపా దేశాల రక్షణ రంగానికి అధిక నిధులు ఖర్చు చేయించడానికి ట్రంప్‌ వ్యూహం పన్నాడని ఆ దేశాలు గ్రహించగలిగాయి. ఈ నేపథó్యంలో ట్రంప్‌ను ఐరోపా పార్లమెంట్‌ సవాలుచేస్తోంది. తాజాగా రష్యా, చైనాల మధ్య చీలిక తెచ్చేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నాడు. దీర్ఘకాలంగా రష్యా తాము కూడా యూరోపియన్లుగా భావిస్తూ వచ్చారు. ఎందుకంటే యూరోపియన్లు బలహీనులని రష్యా భావించిందని తాము ఆధిపత్యం వహించవచ్చునని అనుకున్నది. రెండోసారి అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన తర్వాత ట్రంప్‌ రష్యా నుంచి యూరోపియన్లను విడదీయాలని చూస్తున్నాడు. మిలిటరీ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌ను, దాని ప్రయోజనాలను ట్రంప్‌ చూస్తున్నాడు. ఆ విధంగా ట్రంప్‌ ఒకవైపు సైనికశక్తిని, ఒకవైపు దాని ఆర్థికశక్తిని లేదా మార్కెట్‌శక్తి, సాంకేతికతను ఉపయోగించుకున్నాడు. (ఆధిక్యతను మరోవైపు వినియోగించుకుంటున్నాడు). ఇదే సమయంలో ఏఐ(కృత్రిమ మేధ) సాంకేతికతను దీప్‌సెక్‌ ద్వారా ‘ఒకే బెల్ట్‌, ఒకే రోడ్డు’ ద్వారా చైనా నైపుణ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించింది.
జాతిరాజ్యం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక మూడో ప్రపంచ దేశాలు జాతి రాజ్యాలయ్యాయి. వలసవాదం దాదాపు అంతమైంది. యుఎస్‌ఎస్‌ఆర్‌ నాయకత్వంలో గల సోషలిజంను పూర్తిగా ఓడిరచి అమెరికా ఆధిపత్యం సాధించినకాలంలోనే వలసవాదం అంతమైంది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక, గతంలో పొందిన అనుభవాన్ని తిరిగి సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రపంచం ఎంతగానో మారింది. అందువల్ల డెమొక్రటిక్‌ సోషలిజం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దేశంగావేసే ఎత్తుగడలు పనిచేయవు. దీంతో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు జాతిరాజ్యం ఏర్పడే క్రమంలో సర్వసాధారణమయ్యాయి. ప్రపంచమంతటా 20వ శతాబ్దిలో ప్రజల వలసవాద యజమానులతో పోరాడేకాలంలో జాతీయవాదం ఏర్పడిరది. ఈ దశలోనే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవ్యతిరేకత, స్వతంత్రదేశాలు, అలీన ఉద్యమం ఉద్భవించాయి. నూతనంగా ఏర్పడిన స్వతంత్రదేశాలకు ఇండియా నాయకుడిగా బలపడిరది. ఈ క్రమంలో ప్రజల ప్రయోజనాలు ముఖ్యమయ్యాయి. అయితే 21వ శతాబ్దిలో ప్రపంచం అత్యధికంగా మితవాదశక్తులు మితిమీరాయి. తిరిగి జాతి రాజ్యం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందువల్ల ప్రజల ప్రయోజనాలు వెనక్కివెళ్లిపోయాయి. నిరుద్యోగం అపారంగా పెరిగిపోతోంది. వర్గాల మధ్య అంతరం, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నాయి.
1930`40 మధ్య ఐరోపా దేశాల మధ్య వైరుధ్యాల వల్ల ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగి ఐదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా ఐక్యమై ఫాసిస్టు శక్తులను ఓడిరచకపోతే మళ్లీ జాతిరాజ్యం ఏర్పడి మరోసారి యుద్ధానికి లేదా అనేక యుద్ధాలకు దారితీయవచ్చు. ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్యవిలువలకు మరణశాసనం కావచ్చు.
అమెరికా ఇండియాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటి. అందువల్ల మన ద్వైపాక్షిక సంబంధం అమెరికాతో అత్యంత ముఖ్యం. మన ప్రధాని మోదీ అమెరికా పర్యటన కారణంగా, ట్రంప్‌తో, అమెరికా ప్రథమం అన్న ఆయన విధానంతోనూ మనకు అంచనాలు ఉంటాయి. అమెరికా జాతిరాజ్యం శక్తి అమెరికా మిలిటరీ ప్రయోజనాలు, ఇండస్ట్రియల్‌ పెట్టుబడులను కాపాడగలదు. మన్ముందు ప్రయోజనం కలిగించగలదు. అందువల్ల మన ప్రధాని అమెరికా పర్యటనపై ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అమెరికా మనకు అనేక ఆయుధాలు సరఫరా, అణుశక్తిని అందించడంలాంటి ఒప్పందాలు జరగవచ్చు. అదేవిధంగా అమెరికా మనకు ఖనిజవాయువు, చమురు విక్రయించి లాభాలు పొందవచ్చు.
అమెరికా చైనాను లక్ష్యంగా చేసుకుంది. చైనాను ప్రతిఘటించకుండా అమెరికాకు ఇండియా అవసరమే. ఈ నేపథó్యంలో అమెరికా రూపొందించే చైనా వ్యతిరేక వ్యూహాలలో ఇండియా అనివార్యంగా పాల్గొనవలసిన రావచ్చు. అమెరికాతో చర్చించే సమయంలో ఇండియాను ఇండియా ప్రజలను మన ప్రధాని కాపాడగలరని, మన గౌరవాన్ని నిలపగలరని ఆశిద్దాం. అయితే మోదీ, ఆయన ప్రభుత్వం ఇండియాను పశ్చిమదేశాల ప్రభావంలోకి తీసుకువెళుతున్నారు. ఇది ప్రమాదరకమైన సంకేతం. ఇండియా విదేశాంగ విధాన పరంగా, వ్యూహాత్మక స్వతంత్రతకు ముప్పు కలగవచ్చు. మోదీ పర్యటనకు ముందు మన దేశస్థులు వెళ్లి అక్రమంగా నివసిస్తున్న వారిచేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేసి మనకు అవమానంచేసి పంపినా, మన ప్రభుత్వం మౌనం వహించింది. మోదీ అమెరికాకు లొంగిపోయి మాట్లాడకుండా అవమానాన్ని దిగమింగారు. అమెరికానుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు మన బడ్జెట్‌లో టారిఫ్‌లు తగ్గించారు. ట్రంప్‌ను బుజ్జగించేందుకు ఇది మన ప్రయత్నం. అదానిపైన, ఆయన కంపెనీలపైన పెట్టిన అవినీతి కేసులకు సంబంధించిన చట్టాలను ట్రంప్‌ రద్దు చేశారు. ట్రంప్‌ ప్రభుత్వపాలన ఒత్తిడిని మోదీ, ఆయన ప్రభుత్వం తట్టుకుని నిలవడం ఆశ్చర్యమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు