విశాలాంధ్ర – శేరిలింగంపల్లి : అవనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో మార్చి 16వ తేదీన నిర్వహించే 5కే రన్‌లో పాల్గొనాలని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ని, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ, మహిళలకు ప్రతి చోట గౌరవించాలని, విలువ ఇవ్వాలని, వారి అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ మార్చి 16వ తేదీన శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో జరుగుతున్న 5కే రన్ కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పిలుపునిచ్చారు.